ఆ లారీ ఆ కుటుంబం జీవితాన్నే మార్చేసింది. తప్పు ఎవరిది అని ప్రశ్నించటం కంటే ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అనే బాధపడాలి. ప్రయాణాలు కాస్త ఆలస్యం అవుతే ఎం అవుతుంది ? అతివేగంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎం ప్రజల్లో ఏమో. కొంచం స్పీడ్ తో వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. 

                                  

ఇంకా వివరాల్లోకి వెళ్తే..  మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నసురుల్లాబాద్‌ గ్రామం సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, లారీ ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నసురుల్లాబాద్‌ గ్రామానికి చెందిన నరేష్‌ తన అక్కా, బావ ,ఇద్దరు మేనకోడళ్లను ఆటోలో బూత్‌పూర్‌ గ్రామం నుంచి నసురుల్లాబాద్‌కు తీసుకొస్తున్నారు.

                            

గ్రామ శివారులో జడ్చర్ల వైపు అతి వేగంతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు ఆటోను ఢీ కొట్టింది. దీంతో నరేష్‌తో పాటు తన అక్క జ్యోతి, బావ శంకరయ్య, చిన్న మేనకోడలు మేఘ వర్షిణి అక్కడికక్కడే మృతి చెందారు. నరేష్‌ పెద్ద మేనకోడలు హయాతి(5)కి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రి పాలైంది. 

 

మృతదేహాలను జడ్చర్లకు తరలించగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనకు లారీ డ్రైవర్ అతి వేగమే కారణం అని స్థానికులు చెప్తున్నారు. ఆ నలుగురి ప్రాణాలు తియ్యడానికి దాదాపు 120 స్పీడ్ లో లారీ వచ్చింది అని పోలీసులు చెప్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: