తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టిసి ఉద్యోగులకు రిటైర్ మెంట్ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

 

కొద్ది కాలం క్రితం ఆర్టిసి ఉద్యోగులతో సమావేశం అయిన కెసిఆర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. అయితే మరో విశేషం ఏంటంటే... తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు విషయం మాత్రం కేసీఆర్ ఇంకా తేల్చలేదు కాని.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఆదేశాలపై మాత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారని తెలుస్తోంది. 

 

సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత మాత్రం వరాలు కురిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై ఆర్టీసీ కార్మికులు బదులు.. ఆర్టీసీ ఉద్యోగులు అని పిలవాల్సి ఉంటుంది. అంతేకాదు అధికారిక కమ్యూనికేషన్‌లో పేర్కొనాలని సర్క్యులర్‌లో క్లారిటీ ఇచ్చారు.

 

అంతే కాదు... సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ప్రైవేట్ సర్వీసులకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల్ని ఉద్యోగులుగా పిలుస్తామన్నారు. ఇక ప్రతీ ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు సీఎం. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాటలో నడవాలని.. ప్రతీ ఏటా సంస్థకు రూ.వెయ్యి కోట్లు లాభం రావాలని ఆకాంక్సించారు. ఉద్యోగులు ఏటా బోనస్ అందుకునేలా లాభాలు రావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: