తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీపై కెసిఆర్ దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది.  ఎలాగైనా సరే ఆర్టీసీని లాభాల్లో నడిపించాలని చూస్తున్నారు కెసిఆర్.  కెసిఆర్ అనుకున్నట్టుగా అంతా జరిగితే తప్పకుండా మరో రెండు మూడు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాటలో పయనించడం ఖాయంగా కనిపిస్తోంది.  ముఖ్యంగా ఆర్టీసీ కోసం కొన్ని కొత్త పద్దతులను కెసిఆర్ అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.  అందులో ఒకటి సరుకు రవాణ.  సరుకు రవాణా పద్దతి ద్వారా అదనపు ఆదాయం తీసుకొచ్చేందుకు కెసిఆర్ ప్లాన్ చేశారు.  


ఇందులో భాగంగానే కెసిఆర్ కొన్ని పద్దతులను సూచించారు.  అవేమంటే... ప్రస్తుతం దేశంలో సరుకుల రవాణా కోసం కొన్ని పద్ధతులు తీసుకొచ్చారు.  ఇకపై ప్రభుత్వ ఆఫీస్ లకు సంబంధించిన ప్రతి సరుకు కూడా ఆర్టీసీ ద్వారా మాత్రమే రవాణా జరగాలి.  చిన్న కవర్ దగ్గరి నుంచి ప్రతి ఒక్కటి కూడా వీటిద్వారానే జరగాలి.  అలా చేయడం వలన ఆర్టీసీకి అదనపు ఆదాయం లభిస్తుంది. 


మాములుగా ఇప్పటి వరకు సరుకుల రవాణాను ప్రైవేట్ కొరియర్ లకు ఇచ్చేవారు.  కానీ, ఇకపై అలా కుదరదు.  ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదీ ఆర్టీసీ ద్వారానే జరగాలి.  ఇది అదనపు ఆదాయం.  అంతేకాదు, ప్రైవేట్ వాటితో పోలిస్తే ఆర్టీసీ రవాణా చార్జీలు తక్కువగా ఉంటాయి.  కాబట్టి ఆర్టీసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా ఆదాయం లభిస్తుందని కెసిఆర్ అభిప్రాయం.  ఈ కొరియర్ పాలసీ హిట్టయితే ఆర్టీసీకి కనీసం రూ. 400 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది.  


ఇది అదనపు ఆదాయం కాబట్టి తప్పనిసరిగా ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తుంది.  కనీసం రెండు మూడు నెలల్లోనే లాభాలు వస్తాయి.  దీంతో పాటు ఎలాగో ఆర్టీసీ చార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది.  కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.  ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు కాబట్టి ఆదాయం దండిగా లభిస్తుందని అంటున్నారు ఆర్టీసీ యాజమాన్యం.  బోనస్ లు ఇచ్చేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నది.  సో, సింగరేణి కార్మికులు ఎలాగైతే బోనస్ లు తీసుకుంటారో అలానే ఆర్టీసీ వాళ్ళు కూడా తీసుకుంటారన్నమాట.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: