ఒక రైతు ప్రధాని నరేంద్ర మోడీ కి వీరాభిమాని. ఈ భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడు ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న తన అభిమానాన్ని స్పెషల్ గా చూపించాలని భావించాడు. అందుకే, అతను తన వ్యవసాయ భూమిలో ఒక ఆలయాన్ని నిర్మించి ప్రధానికి అంకితం చేశారు. ఈ ఆలయంలో మహాత్మా గాంధీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత, ప్రస్తుత సిఎం ఎడపాడి పళనిసామి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్రాలు కూడా ఉన్నాయి.


వివరాల్లోకి వెళితే, మోడీ కోసం కట్టిన 'నామో ఆలయం' తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని ఎరాకుడి గ్రామంలో ఉంది. 50 ఏళ్ల రైతు పి శంకర్ గత వారం "నామో టెంపుల్" ను ప్రారంభించి ప్రతిరోజూ పూజలు చేస్తున్నారు.  ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎంకెఎస్ఎన్) వంటివి ప్రధాని మోడీ అమలు చేసారని, ఇంకా రైతుల కోసం మోడీ అమలు చేసిన అనేక పథకాలు తనని ఆకట్టుకున్నాయని శంకర్ అన్నారు. మోడీ వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టమని అన్నారు.


'మన ప్రధానమంత్రి కోసం ఆలయాన్ని నిర్మించడానికి నేను నా స్వంతగా కష్టపడి సంపాదించిన డబ్బును రూ .1,20,000 ఖర్చు చేశాను. నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు', అని ఆయన చెప్పుకొచ్చారు. 'నేను పూజ కార్యక్రమాలు చేయడానికి పూజారిని నియమించాలని ఆలోచించాను. కానీ దానికి ఎక్కువ ఖర్చు కావచ్చు. అందుకే, నేనే స్వయంగా పూజలు చేస్తున్నాను', అని శంకర్ అన్నారు.


తన ఆలయంకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు. గత మూడు రోజులుగా 150 మంది నామో ఆలయాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. కొన్నిరోజుల క్రితం మామల్లాపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా మోదీ వచ్చినప్పుడు కలుద్దామని వెళ్లానని. కానీ, కలవలేకపోయానని శంకర్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా, ప్రస్తుతం శంకర్ కట్టించిన 'నమో టెంపుల్' దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: