2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం టీడీపీ... బీజేపీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.  పార్టీ స్థాపించింది అప్పుడే కాబట్టి ఆ సమయంలో పోటీ చేస్తే కొంత ఇబ్బంది వస్తుందని భావించిన పవన్, తన పార్టీని ఎన్నికల్లో నిలబెట్టకుండా పక్కన పెట్టారు.  తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు.  ఈ ప్రచారం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనే విషయం పక్కన పెడితే, ఆ విషయాన్నీ ప్రజలు తప్పు పట్టలేదు అని చెప్పాలి.

 
ఇక ఇదిలా ఉంటె, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.  అయన పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు.  ఈ ఎన్నికల్లో వైకాపా భారీ విజయం సాధించింది.  అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఎన్నికల తరువాత వైకాపాను టార్గెట్ చేసుకున్నారు.  ముఖ్యంగా మత మార్పిడులుపై జగన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.  జగన్ మత మార్పిడులకు పాల్పడుతున్నారని, జగన్ ఈ మతమార్పిడులను బలవంతంగా చేస్తున్నారని, రాష్ట్రాన్ని క్రైస్తవుల రాష్ట్రంగా మారుస్తున్నారని అన్నారు.  


అటు వైకాపా పాలన విషయంలో కూడా పవన్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.  జగన్ తప్పులు చేస్తున్నారని అంటున్నారు.  ఇలా జగన్ గురించి విమర్శలు చేసిన పవన్, ప్రస్తుతం రష్యా వెళ్లారు.  తన భార్య అన్నా లేజ్నోవా ఇంటికి వెళ్లారు.  దీనికి సంబంధించిన ఎయిర్ పోర్ట్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  అత్తారింటికి వెళ్తూ కనిపించిన పవన్ పై వైకాపా కార్యకర్తలు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 
మత మార్పిడులు చేస్తున్నారని విమర్శించిన పవన్ ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి రష్యా ఎలా వెళ్లారని ప్రశ్నిస్తున్నారు.  దానికి జనసేన కార్యకర్తలు కూడా ధీటైన సమాధానం ఇస్తున్నారు.  పవన్ భార్య అన్నా క్రిస్టియన్ కాబట్టి ఆమె మత సంప్రదాయాలను గౌరవిస్తూ పవన్ అత్తారింటికి వెళ్లారని, అక్కడ అత్తారింట్లో పవన్ క్రిస్మస్ వేడుకలు జరుపుకోబోతున్నారని అంటున్నారు.  మొత్తానికి పవన్ రష్యా పర్యటన టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: