సాధారణంగా స్కూళ్లు, కాలేజీలు.. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఉంటూంటాయి. కో-ఎడ్యుకేషన్ గురించి తెలిసిందే. ఈ తరహా ఎక్కడైనా ఉండేవే. కానీ దేశంలో తొలిసారి ట్రాన్స్ జెండర్లకు కూ ప్రత్యేకంగా ఓ స్కూల్ గానీ, కాలేజీ గానీ ఎక్కడా లేవు. కానీ.. భారతదేశంలో తొలిసారిగా వారి కోసం ప్రత్యేకంగా ఓ యూనివర్శిటీనే రూపుదిద్దుకోనుంది. ఉత్తరప్రదేశ్ లో ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాన్స్ జెండర్ల హక్కులకూ ఓ గౌరవం తీసుకొచ్చేలా ఈ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. ఈ యూనివర్శిటీలో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

 

 

ఉత్తరప్రదేశ్ లోని ఖుషినగర్ జిల్లాలోని ఫాజిల్ నగర్ ప్రాంతంలో ఈ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. ఈ యూనివర్శిటీని అఖిల భారతీయ కిన్నార్ శిక్షా సేవ ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ ట్రస్ట్.. ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ ఎడ్యుకేషన్ సర్వీస్ ట్రస్ట్ లో భాగం. ఈ యూనివర్శిటీలో ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ చదువుకునే సదుపాయాలను కల్పిస్తున్నారు. యూనివర్శిటీలోనే రీసెర్చ్ చేసి పీహెచ్ డీ పట్టాలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ వర్శిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే జనవరిమార్చి నెల నుంచే తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వర్శిటీ ఏర్పాటుపై ట్రాన్స్ జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఈ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణ మోహన్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఈ తరహా యూనివర్శిటీ దేశంలోనే మొట్టమొదటిది. వచ్చే జనవరిలోనే ఇద్దరు ట్రాన్స్ జెండర్ల పిల్లలకు అడ్మిషన్లు ఇస్తున్నాం. ఈ పిల్లలు ట్రస్ట్ ఆధ్వర్యంలోనే పెరిగారు. ఈ యూనివర్శిటీ ట్రాన్స్ జెండర్లకు ఓ గౌరవం తీసుకొస్తుంది’ అని అన్నారు. మొత్తానికి సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని ఈ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: