సరిగ్గా 15 ఏళ్ళక్రితం అంటే 2004 డిసెంబర్ 26 వ తేదీన హిందూమహాసముద్రంలోని సుమత్రా దీవుల్లోని సముద్రంలో అలజడి రేగింది.  ఇండియా, బర్మా ప్లేట్ లలో జరిగిన అలజడి కారణంగా... భూకంపం వచ్చింది.  ఈ భూకంపం కారణంగా 100 కిలోమీటర్లు మేర చీలిక ఏర్పడింది. ఈ భూకంపం దాటికి అలలు 100 మీటర్ల ఎగసిపడ్డాయి.  అప్పుడే క్రిస్మస్ వేడుకలు జరుపుకొని కొంతమంది ఇంకా సముద్రం ఒడ్డున ఉన్న చర్చీల్లో ఉన్నారు.  ఈ అలల ధాటికి 14 దేశాలు కకావికలం అయ్యాయి.  2,30,000 మంది మరణించారు.  


1945లో రెండో ప్రపంచయుద్ధం సమయంలో హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబు వేసినపుడు విడుదలైన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి వెలువడింది.  ఇక ఇదిలా ఉంటె,  సముద్ర గర్భంలో భూకంపం తీవ్రత 9 గా ఉన్నట్టు అమెరికన్ జియోలాజికల్ సర్వే చెప్పింది.  ఆ తరువాత అది 9 కాదు... 9.3 గా నిర్ణయించారు.  ఈ స్తాయిలో ఏర్పడిన భూకంపం కారణంగా ప్రపంచంలో సునామి సంభవించింది.  ఈ సునామి దెబ్బకు 14 దేశాలు దెబ్బతిన్నాయి.  


ఇండియాలోని తమిళనాడు తీరం తీవ్రంగా దెబ్బతిన్నది.  తమిళనాడులో 4500 మంది మరణించారు.  అండమాన్ నికోబార్ దీవుల్లో 4000 మంది మరణించారు.  ఈ సునామి కారణంగా 18వేలమంది నిరాశ్రయులయ్యారు.  తమిళనాడులోని కడలూరు, నాగపట్నంలోని చర్చీల్లో ప్రార్ధనలు చేయడానికి వచ్చిన వేలాదిమంది ఈ సునామి కారణంగా మరణించారు.   సునామి అంటే ఇప్పటికి ప్రజల్లో తెలియని భయం ఉన్నది.  


సముద్రంలో ఎప్పుడు అలజడి చెలరేగినా ప్రజలు భయపడుతున్నారు.  అయితే, సునామి వంటివి చాలా అరుదుగా వస్తాయని, భూకంపం వచ్చిన ప్రతిసారి కూడా సునామి వస్తుంది అనుకుంటే పొరపాటే అని అంటున్నారు నిపుణులు.  సునామి సంభవించి 15 ఏళ్ళు అయ్యింది.  సునామి తరువాత ప్రతి ఏడాది డిసెంబర్ 26 వ తేదీన సముద్రుడికి ప్రజలు పూజలు చేస్తారు.  సముద్రుడికి పూజలు చేసి పూలు, పాలు సముద్రుడికి అభిషేకం చేస్తారు.  డిసెంబర్ 25 పండుగ చేసుకుంటే, డిసెంబర్ 26 న మాత్రం విషాదం నింపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: