తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలంటే 'కమ్మ' కోటరీని దెబ్బతీస్తేనే ఆ పార్టీ బలహీనం అవుతుందని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ భావిస్తూ వస్తున్నాడు. అందుకే బాబు హయాంలో కీలక పదవుల్లో ఉన్నఆ సామజిక వర్గం వారందరిని పక్కకు తప్పించాడు. అలాగే వైసీపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉన్నా, టీడీపీలో కమ్మ సామజిక వర్గానికి చెందిన నాయకులందరిని టార్గెట్ చేసుకుని వారు టీడీపీని వీడి వైసీపీలో కి వచ్చేలా చేయడమో లేక మద్దతు ఇచ్చేలా చేయడమో చేసేలా జగన్ రాజకీయం నడిపిస్తున్నాడు. గన్నవరం టీడీపీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీని ఈ వ్యూహంలో భాగంగానే టీడీపీకి దూరం చేయగలిగాడు. ఇక ఆంధ్రుల కలల రాజధానిగా ఇప్పటివరకు పిలవబడ్డ అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం మొదటి నుంచి జగన్ కు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలో కమ్మ సామజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా ఉండడడమే. అందుకే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వ్యూహం ప్రకారం రాజధాని నిర్మాణంపై ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ నివేదికకు ముందే ఏపీలో మూడు రాజధానులు వస్తాయంటూ అసెంబ్లీ లో ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇక కమిటీ కూడా జగన్ అసెంబ్లీ లో చెప్పిన విధంగానే తమ రిపోర్ట్ కూడా వెల్లడించింది. అయితే ఇదంతా కమ్మ సామజిక వర్గంపై జగన్ కు ఉన్న ఒకరకమైన కోపమే కారణంగా తెలుస్తోంది.

 
ఇక ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ఎంచుకున్నా అక్కడ కమ్మ సామజిక వర్గం ఎక్కువగా ఉండడం, వివిధ పార్టీల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ ప్రాంత నాయకులు ఆ వర్గానికే చెందిన వారు కావడంతో జగన్ కు ఇక్కడ కూడా కమ్మ ఎఫెక్ట్ జగన్ కు గట్టిగా తగిలేలా కనిపిస్తోంది. విశాఖలో గత నాలుగు సంవత్సరాలుగా కమ్మ ఆధిపత్యం గట్టిగానే ఉండి. విశాఖకు చెందిన వారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నెగ్గి చాలా దశాబ్దాలే అవుతోంది. అంతా వలస నాయకుల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి నాలుగు సార్లు విశాఖ ఎంపీ టికెట్ కమ్మ సామాజివర్గానికి చెందిన ఎంవీవీఎస్ మూర్తికి ఇస్తే ఆయన రెండు సార్లు గెలిచారు. రెండు సార్లు ఓడారు. ఇక ఆయన మనవడు శ్రీభరత్ కి తాజా ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఓ విధంగా విశాఖ ఎంపీ టికెట్ అంటే కమ్మ సామజిక వర్గానికే అన్నట్టుగా టీడీపీ ఇక్కడ ఫిక్స్ అయిపొయింది.అలాగే కాంగ్రెస్ నుంచి నెల్లూరుకు కి చెందిన సుబ్బరామిరెడ్డికి రెండు సార్లు ఇస్తే ఆయన ఒకసారి గెలిచి ఒకసారి ఓడారు. అంతకు ముందు కేరళకు చెందిన ఉమా గజపతిరాజుకు కాంగ్రెస్ రెండు సార్లు టికెట్ ఇస్తే ఆమె ఒకసారి గెలిచారు.


 మాజీ సీఎం నెల్లూరుకు చెందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డికి టికెట్ ఇస్తే విశాఖ ఎంపీ అయ్యారు. 2009 నాటికి కాంగ్రెస్ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి టికెట్ ఇచ్చి గెలిపించింది. ఇక 2014 నాటికి బీజేపీ కూడా ఎంపీ టికెట్ ను కమ్మ సామాజిక‌వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబుకు ఇచ్చి టీడీపీ మద్దతుతో గెలిచింది. ఇక ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా  ఇలా ఏ విధంగా చూసుకున్న విశాఖ మొత్తం కమ్మ సామజిక వర్గం గుప్పెట్లో ఉండడం తో జగన్ ఇక్కడ రాజధాని పెట్టినా కమ్మ వారి పెత్తనానికి ఎటువంటి ఢోకా లేదన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: