పిచ్చు పలు రకాలు అనే సామెత వినే ఉంటాము.. ఈ కొంతమంది పిచ్చి అయితే మరి విచిత్రమైనది.. ఇంకా అసలు విషయానికి వస్తే.. గురువారం అంటే ఈరోజు సూర్యగ్రహణం వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సూర్య గ్రహణాన్ని ప్రపంచవ్యాప్తమా ప్రజలందరూ చూశారు.. కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు మూతపడ్డాయి... కొందరు ఎంతో ఆసక్తిగా చూసి ఫోటోలు తీసి ట్విట్టర్ లో పెట్టారు కూడా.. 

                    

ఈ సూర్య గ్రహణాన్ని చూడటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం చూడటానికి ఆసక్తి చూపారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి సూర్యగ్రహణం చూడటం ప్రముఖులు ఎంత ఆసక్తి కనబరిచారో అలానే కొంతమంది ప్రజలు మూఢనమ్మకలతో మరి దారుణమైన పిచ్చి పనులు చేస్తున్నారు. మూఢనమ్మకం అంటూ పసివాళ్ల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. పాత నమ్మకాల పేరుతో వాళ్ల ప్రాణాలను చిక్కుల్లో పెడుతున్నారు.

                                

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక విజయ్‌పూర్ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో దారుణం జరిగింది. మూఢ నమ్మకాల పేరుతో వింత పనులు చేశారు.. పిల్లల్ని మెడ వరకు నేలలో పాతిపెట్టారు. సూర్యగ్రహణం రోజు పాతిపెడితే అంగవైకల్యం పోతుందని తల్లిదండ్రుల మూఢనమ్మకం.. అందుకే పిల్లల్ని ఇలా పాతిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే జనవిజ్ఞాన వేదిక సభ్యులు మాత్రం ఇది మూర్ఖత్వపు చర్య అని, నేలలో ఇలా పాత పెడితే అంగవైకల్యం ఎలా పోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. దేశం ముందుకు వెళ్తున్న ఈ మూఢనమ్మకాలు మాత్రం తగ్గటం లేదు.. రోజు రోజుకు ఎన్నో ఎన్నెన్నో పెరిగిపోతున్నాయి. కాస్త ఆలస్యం అయినా ఈ మూఢనమ్మకాల ఘటనలు అన్ని వెలుగులోకి వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: