వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరుతో ఎవరైనా ల్యాండ్ సెటిల్ మెంట్స్ చేస్తే  వెంటనే క్రిమినల్ కేసులు పెట్టండి అంటూ విజయసాయిరెడ్డి పోలీసులకు తెలిపారు. ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత...  నా పేరు చెప్పుకుంటూ చాలామంది వివాదాస్పద ప్రాపర్టీల విషయంలో  ప్రచారం చేస్తున్నారు. నా పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా నా దృష్టికి  వచ్చింది అంటూ విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అలాంటివారు ఎవరైనా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అంటూ స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. 

 

 కలెక్టర్ కు  పోలీసులకు నేను ఓ  విషయాన్ని చెప్పదలుచుకున్నాను.. ప్రాపర్టీ  విషయంలో  నేను ఏ అధికారి కి ఇప్పుడు వరకు ఫోన్ చేసి పరిష్కరించాలని కోరింది లేదు... భవిష్యత్తులో కూడా అలా నేనెప్పుడూ చెప్పను. ప్రాపర్టీ లా వివాదంలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా ప్రకటించక ముందు తర్వాత కూడా తాను  ఏ ప్రాపర్టీ  విషయంలో అధికారులపై ఒత్తిడి చేయలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. అక్రమ సెటిల్ మెంట్స్  విషయంలో తన పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  విజయసాయి రెడ్డి సూచించారు. 

 

 

 విశాఖలో నాకు ఒక ఫ్లాట్ తప్ప ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. నా పేరు మీదే కాదు కుటుంబ సభ్యుల పేరుతో గాని ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష ఆస్తులు లేవంటూ స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. ఆస్తులు సంపాదించుకోవాల్సిన  అవసరం కూడా తనకు లేదని... ఏ ప్రాపర్టీ విషయంలోను తాను  తలదూర్చను  అంటూ  తెలిపారు. ఏ ప్రాపర్టీ లోను  తన భాగస్వామ్యం లేదని.. తన భాగస్వామ్యం ఉందంటూ ఏదైనా విషయం పోలీసుల దృష్టికి వస్తే వెంటనే తన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలి అంటు  విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదు అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: