ఇంకొన్ని రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు,  ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అంటూ తెలంగాణ రాజకీయాలు  హాట్ హాట్ గా సాగాయి . ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలతో  మరోసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని  పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలైన టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. సరికొత్త వ్యూహాలను... ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి అన్ని పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేయాలని తహతహలాడుతున్నారు. 

 


 అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల నుండి... 2019 ఎన్నికల వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుతూ వచ్చింది. ఎన్నికలు ఏవైనా  టిఆర్ఎస్ మాత్రం విజయ ప్రభంజనం మోగించింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో తప్ప మిగతా అన్ని ఎలక్షన్లో టిఆర్ఎస్ కు  ఏ పార్టీ కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయాయి. అయితే ఈసారి మాత్రం టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ . ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన  మున్సిపాలిటీ ఎన్నికల్లో  కాంగ్రెస్ అత్యధికంగా సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. దీంతో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. 

 

 

 ఇక అంతే కాకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ రోజురోజుకీ బలపడుతోంది... ఈ అంశం మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కి కలిసొచ్చే లానే ఉంది. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు కూడా కాంగ్రెస్ బిజెపి పార్టీలు టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి. ఇంకొన్ని రోజులు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో  కూడా కాంగ్రెస్ బిజెపి పార్టీలు టిఆర్ఎస్ ను ఓడించడానికి ఇప్పటినుంచి పావులు కదుపుతున్నారు. ఇకపోతే టిఆర్ఎస్ 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ తన సత్తా చాటుతూ వచ్చింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కాస్త తక్కువ స్థానాలు గెలిచినప్పటికీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటింది టిఆర్ఎస్. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎదురు లేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నిన...  ఎన్ని ప్రణాళికలు రచించిన.. ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం టిఆర్ఎస్ పార్టీని ఓడించడం  సాధ్యం కాని పని అన్నట్లుగా తెలుస్తుంది . చూడాలి మరి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేసీ.. ఎంత వరకు సక్సెస్ అవుతాయన్నది.?

మరింత సమాచారం తెలుసుకోండి: