దిశ అత్యాచారం హత్య ఘటన విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు తీవ్రస్థాయిలో రావటం జరిగాయి. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఎన్కౌంటర్ అయిన విషయం దేశం మొత్తం మీద సంచలనం సృష్టించింది. అంతేకాకుండా సరైన విధంగా పోలీసులు నిందితులకు తగిన శిక్ష విధించారని దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమైంది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఆడవాళ్లను కాపాడాలనే ఉద్దేశంతో దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ కు సంబంధించి అధికారులతో భేటీ అయిన సందర్భంలో వైయస్ జగన్ రాష్ట్రంలో ఆడపిల్లలు అందరూ ఎటువంటి భద్రత తమకు కావాలని అనుకుంటున్నారో ఆ స్థాయిలో భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులతో భేటీ అయి దిశ చట్టం పగడ్బందీ అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

అంతేకాకుండా ఈ మేరకు 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలని కూడా సంబంధిత అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో చిన్నారులపై మరియు మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు దిశ చట్టంపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ‘దిశ’ యాక్ట్‌ చట్టానికి సంబంధించి అన్ని సదుపాయాలను కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.

 

అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయడానికి రెడీ కాబోతున్నారు. దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు సీఎం. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్‌ స్టేషన్లలో 1 డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలను, నలుగురు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయాలంటూ డీజీపీ ప్రతిపాదించగా... సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. మరియు అదే విధంగా వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్‌ చేయాల్సిన కాల్‌సెంటర్, యాప్, వెబ్‌సైట్లపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

 

ఇందులో భాగంగా సురక్ష స్పందన యాప్‌ తయారు చేశామని డీజీపీ ముఖ్యమంత్రికి తెలిపారు. దీని ద్వారా మొత్తం 86 రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఈ యాప్‌ను ప్రారంభిస్తామని.. 100,112 నంబర్లను దీనితో ఇంటిగ్రేట్‌ చేయాలని నిర్ణయించారు. అయితే.. దీంతో పాటు దిశ యాప్‌ కూడా పెట్టాలని సీఎం సూచించారు. వీటి కోసం అవసరమైన నిధులను మంజూరు చేయబోతున్నట్లు అదేవిధంగా దేశ చట్టం అమలు కోసం పోలీసు విభాగంలో ఓ సీనియర్ ఐపిఎస్ అధికారిని ప్రేమించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు  దానికి తగ్గ ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. దిశ చట్టానికి అమలు కావడానికి కావలసిన వ్యవస్థలన్నీ పూర్తిగా త్వరగా సన్నద్ధం కావాలని సీఎం జగన్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: