ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో ఈ అంశం దుమారం రేపుతున్న విషయం   తెలిసిందే. అమరావతి రైతుల నిరసనలు ఆందోళనలు... టిడిపి నేతల విమర్శలతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది.కొంతమంది ప్రతిపక్ష నాయకులు సైతం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతుంటే..   కొంతమంది మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాలలో సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానిలో నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజకీయాల్లోనే కొంతమంది ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. 

 

 

 

 ఇకపోతే తాజాగా మూడు రాజధానిల  నిర్ణయం పై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విశాఖకు వస్తుంది అని తెలియడంతో విశాఖ వాసులు అందరూ భయపడుతున్నారు అని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు.  జగన్ పాలనలో తమ ఆస్తులు ఏమవుతాయో అని విశాఖపట్నం ప్రజలు భయపడుతున్నారని టిడిపి నాయకుడు కూన  రవి కుమార్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత కూన రవికుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి మనుషులు విశాఖలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు టీడీపీ నేత కూన రవికుమార్. 

 

 

 

 విశాఖలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఓ 5 స్టార్ హోటల్ కట్టించాలని జగన్ విజయసాయిరెడ్డి లు  ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రవికుమార్. తన పేరుతో సెటిల్మెంట్లు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ  విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత కూన రవికుమార్.. అసలు సెటిల్మెంట్ చేస్తుందే  విజయసాయిరెడ్డి అంటూ ఆరోపించారు. విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అభివృద్ధి జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు టీడీపీ నేత కూన రవికుమార్. ఇకపోతే అంతకు ముందుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. రాజధాని వస్తుందని తెలిసి చాలా మంది తన పేరు చెప్పుకొని అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నారు అని అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను కోరారు. విశాఖలో ఒక ప్లాటు తప్ప తనకు ఎలాంటి ఆస్తులు లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: