ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానులలో ఒక రాజధానిగా విశాఖను వైయస్ జగన్ సర్కార్ గుర్తించిన విషయం అందరికీ తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వైయస్ జగన్ చేసిన ఈ ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు నాయకులు వైయస్ జగన్ తీసుకొన్ననిర్ణయం మంచిదని సపోర్ట్ చేస్తూ ఉండగా మరో పక్క అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మరియు ప్రజానీకం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నెల 27వ తారీఖు న విశాఖలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వైయస్ జగన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పూర్తిగా అమరావతి కి షాక్ ఇచ్చే విధంగా జగన్ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకోకు అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

ఇప్పటికే విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని డిమాండ్ ఎక్కువ అవుతున్న తరుణంలో క్యాబినెట్ భేటీలో కూడా అధికారికంగా ఈ అంశాన్ని ప్రస్తావించి వెంటనే ప్రకటించే ఆలోచనలో జరగనున్నట్లు ఇందుకోసం ఎప్పటికీ క్యాబినెట్ భేటీ కాకముందే విశాఖ అభివృద్ధికి దాదాపు 400 కోట్లు నిధులు జగన్ సర్కార్ కేటాయించడం జరిగింది.

 

కాపులప్పాడులో బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ.22.50 కోట్లు - కైలాసగిరి ప్లానిటోరియానికి రూ.37కోట్లు - సిరిపురం జంక్షన్ లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ అండ్ వాణిజ్య సముదాయం కోసం రూ.80కోట్ల నిధులు కేటాయించింది. రేపు జగన్ ఆధ్వర్యంలో జరగబోయే క్యాబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న ఉత్కంఠ అటు అమరావతి రాజధాని ప్రాంతంలో ను విపక్షం లోను ఆసక్తి నెలకొంది. మొత్తంమీద చూసుకుంటే వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి జరుగుతుందని భావించి మూడు రాజధానులలో ఒక రాజధానిగా విశాఖను ఎంపిక చేయడం పట్ల చాలామంది రాజకీయ మేధావులు జగన్ తీసుకొన్ననిర్ణయం కరెక్ట్ అని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: