చదవటానికే విచిత్రంగా ఉందా హెడ్డింగ్ ? స్టోరీ చదివితే తెలుస్తుంది ఇందులోని లాజిక్. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత  అమరావతి కేంద్రంగా ఓ సెక్షన్ జనాలు చేస్తున్న రచ్చ గురించే లేండి.  రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మరింత అప్పుల్లోకి నెట్టేశాడు. కాబట్టి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఏదో కంతకు తగ్గ బొంత అన్నట్లుగా రాజధాని ఏర్పాటు చేసుకోకుండా కలల్లో విహరించారు కాబట్టే ఇపుడు రైతులు రోడ్డెక్కాల్సొచ్చింది.

 

2014లో సిఎం అవ్వగానే చంద్రబాబు భ్రమల్లో ముణిగిపోవటం ఎక్కువైపోయింది.  అందుకనే కలల రాజధాని అని ఒకసారి ప్రపంచ ప్రఖ్యాత రాజధానుల్లో ఒకటి అని మరోసారి చెప్పారు. నిజానికి అంతస్ధాయిలో రాజధాని నిర్మించటానికి ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి అనుమతించదు. అందుకనే ల్యాండ్ పూలింగ్ అంటూ ఓ నాటకమాడి రైతులను  మభ్యపెట్టారు. వాళ్ళనుండి వేల ఎకరాలను తీసుకుని  వాళ్ళని కంపుచేసేశారు.

 

ఐదేళ్ళ పాటు  వాళ్ళని వ్యవసాయం చేయనీయలేదు అలాగని రాజధానీ నిర్మించలేదు.  ప్రపంచప్రఖ్యాత రాజధానిని  నిర్మంచలేడని అందరికీ అర్ధమవుతున్నా చంద్రబాబుతో పాటు  రైతులు కూడా అదే భ్రమల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. చంద్రబాబు మాయలకు లొంగిపోయిన రైతులు భ్రమల్లో ఉన్నారంటే అర్ధముంది ? కానీ చంద్రబాబు కూడా తాను నిర్మించగలననే భ్రమల్లో ఎలా ఉన్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

కేంద్రం ఇచ్చిన కాడికి నిధులిచ్చి తర్వాత ఆపేసింది. ఇచ్చిన నిధుల్లో కూడా భారీ ఎత్తున అవినీతిని చూసిన తర్వాత ఏ ఆర్ధిక సంస్ధలు కూడా అప్పులు ఇవ్వటానికి ఇష్టపడలేదు. బ్యాంకులను అప్పులు అడిగితే  రీపేమెంట్ విషయం చెప్పమన్నపుడు చంద్రబాబు వెనక్కుతగ్గారు.  దాంతో ఎక్కడ కూడా అప్పులు పెట్టకపోవటంతో  రాజధాని నిర్మాణం అటకెక్కింది.

 

ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు తనను తాను మోసం చేసుకోవటమే కాకుండా రైతులను కూడా నిండా ముంచారని  అర్ధమైపోతోంది.  ఆ విషయం ఇపుడు రైతులకు అర్ధమవ్వటంతో చంద్రబాబు మీద కోపమంతా జగన్మోహన్ రెడ్డి మీద చూపుతున్నట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: