పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనలలో మరణించిన ఇద్దరు ముస్లిం యువకుల  కుటుంబాలను కలవడానికి ఉత్తర ప్రదేశ్ మంత్రి గురువారం నిరాకరించారు, వారిని ఉపద్రవి, విధ్వంసకారులు  అని  అయన  పిలిచారు.  నేను ఎందుకు విధ్వంసకారుల  ఇళ్లకు  వెళ్ళాలి?  విధ్వంసానికి పాల్పడిన వారు, దేశం , రాష్ట్రా ఆస్తులను  కాల్చివేసినారు.  వారి కుటుంబాన్ని నేను ఎందుకు కలవాలి  అని మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్, రెండు ముస్లిం కుటుంబాల ఇళ్లను సందర్శించకూడదనే తన నిర్ణయాన్ని సమర్థించారు.  నహ్తౌర్ / బిజ్నోర్‌ను మంటల్లో పెట్టాలనుకునే వారిని నేను ఎందుకు సందర్శించాలి?   అని తన నిర్ణయాన్ని మంత్రి  సమర్థించుకున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో వృత్తి విద్య మరియు నైపుణ్య అభివృద్ధి మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్, జిల్లాలోని నెహ్తౌర్ ప్రాంతాన్ని తాకిన హింసలో గాయపడిన ఓం రాజ్ సైని మరియు అతని కుటుంబ సభ్యులను కలిశారు.  ఒక మీడియా వ్యక్తి యుపి మంత్రిని ప్రత్యేకంగా మీరు హిందూ, ముస్లింల మధ్య  వివక్ష ను చూపడం లేదా   అని అడిగినప్పుడు, నేను ఎందుకు విధ్వంసకారుల ఇళ్లకు వెళ్ళాలి? నా మాట వినండి. విధ్వంసం చేస్తున్న , విధ్వంస ప్రవృత్తి కల  వారు సమాజంలో భాగమేనా? నేను అక్కడికి ఎందుకు వెళ్లాలి? ఇది హిందూ-ముస్లిం ల మధ్య వివక్ష  గురించి కాదు. నేను ఎందుకు విధ్వంసాకారుల ఇళ్లకు  వెళ్ళాలి?  అని అయన తన వాదనను సమర్థించుకున్నారు.  బిజ్నోర్‌లో జరిగిన హింసలో మరణించిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం కలిశారు.

 

 

 

 

 

శుక్రవారం జరిగిన హింసాకాండలో ఐఎఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న  20 ఏళ్ల సులేమాన్, 25 ఏళ్ల అనాస్ ప్రాణాలు కోల్పోయారు.  ప్రాధమిక తిరస్కరణల తరువాత, సులేమాన్ పోలీసు బుల్లెట్‌తో మరణించాడని,  అతను  తుపాకీ నుండి ఒక పోలీసుపై కాల్పులు జరిపిన సందర్భంలో  తమను తాము కాపాడుకునే ప్రక్రియలో అతను  కాల్చి చంపబడ్డాడని స్థానిక పోలీసులు అంగీకరించారు. అయితే సులేమాన్ కుటుంబం దీనిని ఖండించింది, నిరసనలతో సులేమాన్ కు  ఎటువంటి సంబంధం లేదని వారు  చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: