ఇండియా పాక్ దేశాల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో చెప్పక్కర్లేదు.  రెండు దేశాల మధ్య సత్సంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  ఇప్పటికే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  ఇలా రెండు దేశాల మధ్య గొడవలు పడుతూనే ఉన్నాయి.  1947 నుంచి ఈ సమస్య ఉన్నది.  ఇండియాపై దాడి చేసి ఆసియాలో ఇండియాను ప్రశాంతంగా ఉంచకూడదు అని పాక్ ప్లాన్.  అందుకే ఇండియాలోకి ఉగ్రవాదులను పంపి దాడులుచేయించేందుకు ప్లాన్ చేస్తుంది.  


ఇండియా అంతర్గత విషయాల్లో తలదూర్చి చాలాసార్లు తలపోటు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.  అయినా సరే పాక్ మాత్రం తన బుద్దిని మార్చుకోవడం లేదు.  ఇబ్బందులు పెడుతూనే ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె,  ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాక్ ఎంతగా గొడవ చేసిందో చెప్పక్కర్లేదు.  కారణం కాశ్మీర్ పై కన్నేసింది కాబట్టి.  ఇప్పుడు పౌరసత్వం బిల్లు విషయంలో కూడా గొడవ చేస్తున్నది.  ఎందుకంటే తమ దేశం నుంచి అక్రమంగా ఇండియాలో ఉంటున్న వాళ్ళను ఎక్కడ తిరిగి తమ దేశానికి పంపుతారేమో అనే భయం.  


అందుకే పాక్ ఇండియాలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే పార్టీలకు అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నది.  ఇది వాస్తవం.  ఇక ఇదిలా ఉంటే, పాక్ తోనే గొడవలు అనుకుంటే, ఇప్పుడు ఆ దేశం నుంచి ఇండియాలోకి వచ్చిన మిడతలపై కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది.  మిడతల దండు గుజరాత్ పై దండెత్తాయి.  గుజరాత్ లోని పంటపొలాలపై దాడులు చేసి పంటలను హాంఫట్ చేస్తున్నాయి.  


దీంతో రైతులు షాక్ అవుతున్నారు.  పాక్ భూభాగం నుంచి మిడతలు దండయాత్ర చేసి పొలాలు నాశనం చేస్తున్నాయని కేంద్రాన్ని మొరపెట్టుకున్నారు.  దీంతో రియాక్టయినా కేంద్రం ఇప్పటికే 11 కేంద్ర బలగాలను గుజరాత్ పంపించింది.  ఈ టీమ్ మిడతల పనిపడుతున్నది.  మిడతలను చంపేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకున్నది.  అయితే, ఇప్పుడు అందరిలోనూ ఓ అనుమానం కలుగుతున్నది.  ఈ మిడతలు మామూలుగానే పాక్ నుంచి వచ్చాయా లేదంటే వాటితో ఏదైనా ప్రమాదం ఉన్నదా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.  ఎందుకంటే పాక్ నుంచి వచ్చే ప్రతిదాన్ని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: