మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకునేట్లుగా జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా మైండ్ గేమ్ మొదలుపెట్టారు.  రాజకీయ పార్టీ నేతగా జగన్ పై ఒత్తిడి తేవటంలో చంద్రబాబు విఫలమయ్యారు. అందుకనే ఇక ఎల్లోమీడియానే దిక్కనుకుని వారం రోజులుగా ఎల్లోమీడియాను రంగంలోకి దింపారు. ఇందులో భాగమే లేని ఆందోళనలను ఉన్నట్లుగా కథనాలను వండి వార్చటంలో ఆ మీడియా కూడా తెగ ఆయాస పడిపోతోంది.

 

రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నానికి  తరలించాలని జగన్ డిసైడ్ అయ్యారు. అదే విషయాన్ని అసెంబ్లీలో సూచనప్రాయంగా చెప్పారు. తర్వాత జీఎన్ రావు కమిటి కూడా అదే విధంగా నివేదిక ఇవ్వటంతో రాజధాని తరలింపు లాంఛనమే అని తేలిపోయింది.  దాంతో జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు చంద్రబాబు రంగంలోకి దిగారు. అయితే కర్నూలులో హై కోర్టు ఏర్పాటును, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను వ్యతిరేకిస్తారా ? అంటూ పార్టీలోని పై ప్రాంతాల్లోని నేతలు చంద్రబాబుకు ఎదురుతిరిగారు.

 

తన ప్రయత్నాలకు పార్టీలోని నేతల నుండే వ్యతిరేకత రావటంతో చంద్రబాబుకు షాకయ్యారు. దాంతో  బాగా ఆలోచించి చివరకు ఎల్లోమీడియాను రంగంలోకి దింపారు. దాంతో రెండు ప్రధాన మీడియా సంస్ధలు చంద్రబాబుకు వత్తాసుగా  జగన్ కు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని కొందరు స్ధానికులను, పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి ఆందోళనలు  చేయిస్తోంది. ఎల్లోమీడియాకు స్ధానిక పార్టీ నేతలు సహకారం అందిస్తున్నారు.

 

జగన్  ప్రతిపాదనకు వ్యతిరేకంగా పదిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయంటూ ఎల్లోమీడియా ఎంత మొత్తుకున్నా గుంటూరు జిల్లాలోనే ఉన్న మిగిలిన ప్రాంతాల్లోని జనాలు  మాత్రం తమకు పట్టనట్లుంటున్నారు.  దీంతోనే ఈ ఆందోళనల్లో  పెయిడ్ ఆర్టిస్టుల పాత్రే ఎక్కువన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.  నిజమైన రైతులెవరు తమ పొలాలను ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తానంటే  వద్దనరు.  అభివృద్ధి ఆగిపోతుందని అంటున్న వారందరూ రాజధాని అభివృద్ది అని కాకుండా రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఆగిపోతుందనే ఆందోళన పడుతున్నారు. అందుకనే ఇంత గోల చేయిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: