ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని అభివృద్ధి ఒకేచోట ఆగిపోకూడదు అని ఉద్దేశంతో రాష్ట్ర  3రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానిలో ప్రకటనతో విపక్ష పార్టీల ని ఒక్కసారిగా కంగుతిన్నాయి. తీవ్ర  విమర్శలు చేస్తున్నాయి. జగన్మోహన్ 3 రాజధానిల నిర్ణయం వల్ల ప్రజాధనం వృథా అవ్వడమే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదని ఆరోపిస్తున్నాయి. అటు అమరావతి రైతులు కూడా తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. 

 

 

 

 తమ పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాలకోసం పంట పండించుకొని భూమి అమరావతి కోసం త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి మార్పు చేస్తామంటే తమకు అన్యాయం జరుగుతుందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమరావతిలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీక్షలు ధర్నాలు నిరసనలతో అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపి అమరావతి రైతులందరికీ మద్దతు తెలుపుతుంది . ఈ క్రమంలోనే టిడిపి ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ నేత పీవీపీ  విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. 

 

 

 ఏపీ రాజధాని విషయంలో ప్రజల మాట వినాలి తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మాట్లాడరాదు అంటూ వైసీపీ నేత పివిపి విజయవాడ ఎంపీ కేశినేని నాని టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు పివిపి. రోజమ్మ మొదలుకొని ఎందరో నాయకులని అనిచేద్దామని మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బ్రదర్.. ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తిస్తుంది.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది అని ఆయన తెలిపారు. నువ్వు నేను మూసుకొని ఆంధ్రులందరికీ మాట విందాం కేశినేని నాని అని అన్నారు వైసిపి నేత పీవీపీ . ఇక పీవీపీ  చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: