ఈమధ్య దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా దొంగల చేతివాటం చూపిస్తున్నారు. ఏది దొరికితే అది అందినకాడికి దోచుకుంటున్నారు. రైళ్లు బస్సుల్లో  అయితే ఈ దొంగల బెడద రోజురోజుకి మరీ ఎక్కువై పోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దొంగలు తమ చేతివాటం మాత్రం చూపించేస్తున్నారు. మొబైల్స్ పర్స్ విలువైన వస్తువులు ఇలా చేతికి అందిన  కాడికి  దోచుకు పోతున్నారు. దీంతో ప్రయాణికులు అవక్కవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రైళ్లలో అయితే ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. రైళ్లలో ప్రయాణించే వారికి దొంగల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు దొంగలు ఎవరు మామూలు ప్రయాణికులు ఎవరు గుర్తు పట్టడం చాలా కష్టం. 

 

 

 

 అయితే ఇక్కడ రైల్లో ఓ దొంగతనం జరిగింది... రైలు కదులుతూ  ఉన్న సమయంలో ఓ యువకుడి ఫోన్ లాక్కొని రైలు నుంచి కిందకు దూకి పరిగెత్తాడు దొంగ. ఇక దొంగను పట్టుకునేందుకు రైలు నుంచి దూకిన యువకుడు వెంబడించి ఆ దొంగను  పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోనే ఉప్పుకూడా రైల్వే స్టేషన్ లో జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఫలక్నామా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో  ఉప్పుగూడ స్టేషన్ లో సాయి తేజ్ అనే యువకుడు ఎక్కాడు. 

 

 

 ఎంఎంటీఎస్ రైలు మలక్పేట స్టేషన్ వద్దకు వచ్చిన సమయంలో సాయి తేజ అనే యువకుడు ఫోన్ మాట్లాడుతుండగా... దొంగ అతని చేతి నుంచి ఫోన్ లాక్కుని నడుస్తున్న రైలు నుంచి దూకి పరుగులు పెట్టాడు. ఇక తన ఫోన్ ఎత్తు కెళ్తున్నాడు  అని షాక్ కి గురైన సాయి తేజ వెంటనే అతను కూడా కదులుతున్న రైలు నుంచి దూకేశాడు. ఆ దొంగను వెంటాడి మరీ పట్టుకున్నాడు. ఆ తరువాత మిగతా ప్రయాణికులతో కలిసి దేహశుద్ధి చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు కూడా ఉప్పు గుడాకి చెందిన రియజ్  గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: