రోజురోజుకు వైర్లెస్ డాటా  వినియోగం పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు వైర్లెస్ డాటా లేకుండా అసలు ఏ పని చేయ లేకుండా ఉన్నాం. ప్రపంచం మొత్తం డాటా పైనే ఆధారపడి ముందుకు నడుస్తుంది. ఆధునిక టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతోంది. ఏ పని కావాలన్నా అరచేతి నుంచి జరిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు... కష్టపడాల్సిన పనిలేదు. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో  ఒక్క క్లిక్ చేస్తే చాలు అన్ని  మన ముంగిటికి వచ్చేస్తున్నాయి. అలాంటి జీవితాన్ని గడుపుతున్నారు నేటి తరం ప్రజలు. కాగా టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ వైర్లెస్ డాటా వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. అసలు డాటా వినియోగం లేకుండా ప్రపంచం ముందుకు నడవదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మన భారతదేశంలో కూడా డాటా వినియోగం అత్యధికంగా ఉంది.

 

 ప్రపంచంలోని అన్ని రంగాలలో ప్రస్తుతం వైర్లెస్ డాటా  కీలకంగా మారింది. ఇక మొబైల్ వినియోగదారుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల వాడకం మామూలుగా ఉండదు. ఒకప్పుడు వన్ జీబీ డేటాను నెల మొత్తం సరిపెట్టుకునే మొబైల్ వినియోగదారులు.. ఇప్పుడు గంట సమయానికి కూడా సరిపెట్టుకో లేనంత పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వైర్లెస్ డేటాను మంచి చేయడానికి ఉపయోగిస్తుంటే ఇంకొంతమంది చెడు పనికి ఉపయోగిస్తూ ఉంటారు. ఏది ఏమైనా మన దేశంలో వైర్లెస్ డాటా వినియోగం భారీగా పెరిగిపోయింది. రోజురోజుకు స్మార్ట్ ఫోన్లు పెరుగుతున్నట్లు మొబైల్ డేటా వినియోగం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.

 

 

 మొబైల్ ధరలు భారీగా తగ్గిపోవడం.. దీంతో ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ల  వైపే మొగ్గు చూపుతుండటం... ఇక స్మార్టు ఫోన్ లో  వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ యాప్స్  రావడం.. దీంతో  రోజంతా స్మార్ట్ ఫోన్లోనే గడుపుతూ ఉండటం తో మొబైల్ డేటా వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మొబైల్ డేటా ఛార్జీలు తగ్గినా పెరిగినా వినియోగంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మొబైల్ డేటా వినియోగం మన దేశంలో ఎంతలా పెరిగింది అంటే 2014 సంవత్సరంలో 82.8 కోట్ల జీబీ దాటాను కస్టమర్లు వాడితే... 2018 సంవత్సరం నాటికి ఈ డాటా వాడకం 4640 కోట్ల జీబి డాటాకు  చేరుకుందని ట్రాయ్  గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో జనవరి నుండి సెప్టెంబర్ వరకు 5491.7 కోట్ల జీబీగా  నమోదైంది డాటా వినియోగం . 2014 సంవత్సరంలో టాటా యూజర్ల సంఖ్య 28.16 కోట్లు ఉండగా 2018 నాటికి 66.48 కోట్లకు చేరింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు డాటా వినియోగం పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: