ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేస్తూ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం అమరవతిలోనే రాజధాని ఉంచాలని పట్టుబడుతుంది. ఓవైపు అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల రైతులు రాజధాని ఇక్కడే ఉంచాలని పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏం జరుగుతుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తోంది మాత్రం ఉద్యోగులే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై వారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

రాజధాని అంశంపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 'సచివాలయ తరలింపుపై ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగులం అందరూ కట్టుబడి ఉంటాం. ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగుల్లో వ్యతిరేకతా లేదు.. సానుకూలతా లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఉద్యోగులుగా మేము అమలు చేయాల్సిందే. ప్రభుత్వ పాలన అమరావతికి వచ్చినప్పటి నుంచీ హైదరాబాద్ లో కుటుంబాలు ఉంచి.. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగులు. కొందరు ఇక్కడే భూములు, ఇళ్లు కొనుగోలు చేశారు కూడా. ఈ అంశాలను ప్రభుత్వం వద్ద ప్రస్తావిస్తాం. ఉద్యోగులకు వడ్డీలేని లోన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని   కోరుతాం' అని వారు స్పష్టం చేశారు.

 

 

నిజానికి ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం ప్రకరమే నడుచుకోవాల్సి ఉంటుంది. అందుకే.. అప్పట్లో హైదరాబాద్ నుంచి పరిపాలన అమరావతికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మార్చినప్పుడు ఇక్కడకు వచ్చేసారు. విజయవాడలో, గుంటూరులో, అమరావతి ప్రాంతంలో వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ తెర మీదకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వారు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. గతంలో కూడా వారు అప్పటి ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి వచ్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: