ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అయితే తెలుగు సినిమాకు పండగేనా...? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా వారికి అనేక ఆఫర్లు ప్రకటించినా సరే ఆంధ్రప్రదేశ్ వెళ్ళేది లేదని సిని పెద్దలు పదే పదే చెప్తూ వచ్చారు. షూటింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశాలు ఉన్నా సరే, పెద్దగా షూటింగ్ కి ఆంధ్రప్రదేశ్ రాలేదు.

 

తాజాగా ఏపీ కేబినెట్ స‌మావేశంలో ఏపీ కి మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టిస్తూ దాదాపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా వార్త‌లు వెలుడుతున్నాయి. అదే జ‌రిగితే సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద పండ‌గే అని చెప్పాలి. గ‌తంలో సినిమా వాళ‌లు ఆంధ్రా వైపు చూసిన‌ప్పుడు దీనికి కెసిఆర్ అడ్డుపడ్డారు అనే విమర్శలు ఆంధ్రప్రదేశ్ లో వినిపించాయి. ఇప్పుడు మూడు రాజధానులు అంటూ జగన్ ఒక కీలక ప్రకటన చేసారు. దీనితో తెలుగు సినిమాకు పండగే అంటున్నారు పరిశీలకులు.

 

విశాఖ సహా ఉత్తరాంధ్రలో షూటింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాకినాడ కూడా దగ్గరగా ఉంటుంది. దీనితో సిని పరిశ్రమ అక్కడ స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఇక విశాఖలో కూడా సినిమాకు మంచి ఆదరణ ఉంది. విజయవాడ, గుంటూరు తో పోలిస్తే విశాఖ చాలా పెద్ద నగరం. హైదరాబాద్ తో పోల్చే పరిస్థితులు ఉన్నాయి. దీనితో ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిని పరిశ్రమ విశాఖ వెళ్ళడానికి అవకాశాలు అనుగుణంగా ఉన్నాయి.

 

ఇక అక్కడ యువతకు కూడా సినిమా రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో, సిని పరిశ్రమ నిర్మాణానికి మంచి అవకాశం దొరుకుతుంది. దీనితో స్టూడియో నిర్మాణాలు కూడా విశాఖలో జరిగే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు విశాఖకు కలిసి వచ్చేవే. 

మరింత సమాచారం తెలుసుకోండి: