దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వినియోగదారుల అందరికీ నాణ్యమైన సేవలను అందజేస్తూ... ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నప్పటికీ దిగ్గజ  బ్యాంకు సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఫై ఖాతాదారులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలోనే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న బ్యాంకింగ్ సంస్థ గా రికార్డు సృష్టించింది. అయితే తమ వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటుంది. సరికొత్త సేవలను  ప్రకటిస్తూ వినియోగదారులను బాగా ఆకర్షిస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతే కాకుండా వినియోగదారులకు సేఫ్టీ కోసం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. 

 


 సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించేందుకు ఎప్పటికప్పుడు తమ తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ పలు సూచనలు ఇస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా తమ ఖాతాదారులకు ఎప్పుడు నగదు అందుబాటులో ఉండేలా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతుంది. అయితే స్టేట్ బ్యాంక్ ని మరింత విస్తృతం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎస్బిహెచ్ బ్యాంకును  ఎస్బిఐ లో విలీనం చేసింది కేంద్రం. దీని ద్వారా ఎస్బిఐ బ్యాంకు మరింత పటిష్టంగా మారిపోయింది. ఇకపోతే తాజాగా తమ ఖాతాదారుల కోసం ఓ మంచి ఆలోచన చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్జెంట్గా నగదు అవసరమైనప్పుడు ఏటీఎం కార్డు మర్చిపోయినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఖాతాదారులు ఏటీఎం కార్డు లేకుండానే.. ఏటీఎం దగ్గరకు వెళ్లి నగదు తీసుకునే వెసులుబాటు కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 

 

 

 ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా  చేసుకునేందుకు ఎస్బిఐ మరో కొత్త విధానాన్ని నూతన సంవత్సర కానుకగా వినియోగదారులకు అందించనుంది. ఈ విధానం 2020 జనవరి 1 నుంచి ప్రవేశపెట్టనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏటీఎం కార్డు అవసరం లేకుండా సంబంధిత ఖాతాకు అనుసంధానం అయి ఉన్న మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటిపి ఆధారంగా ఎటిఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనిద్వారా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎటిఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే విత్ డ్రా  మొత్తం పది వేల రూపాయలకు మించి ఉండాలని దీనికి ఇలాంటి ఛార్జీలు వర్తించవు  అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: