ఔను! ప్ర‌తి ఒక్క‌రూ ఇప్పుడు ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో ని 29 గ్రామాల ప్ర‌జ‌లు, రైతులు ఇప్ప‌టికే రోడ్ల‌పై కి వ‌చ్చి ఆందోళ‌న‌లు చేస్తున్నారు. గ‌డిచిన వారం రోజులు గా వారు ఆందోళ‌న‌లు చేస్తున్నా.. శుక్ర‌వారం మాత్రం ఇవి మ‌రింత తీవ్ర‌మ‌య్యాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. శుక్ర‌వారం జ‌గ‌న్ కేబినెట్ మీటింగ్ ఉండ‌డ‌మే. ముఖ్యంగా ఇటీవ‌ల రాష్ట్ర అభివృద్దికి సంబంధించి అధ్య య‌నం చేసిన జీఎన్ రావు క‌మిటీ నివేదిక అంద‌డంతో దీనిపైనే జ‌గ‌న్ చ‌ర్చిస్తార‌ని అంద‌రూ అనుకుంటు న్నారు.

 

అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి విష‌యంపై క్లారిటీ కూడా ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నారు. జీ ఎన్ రావు క‌మిటీ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం అమ‌రావ‌తిలో స‌చివాల‌యం మాత్ర‌మే ఉంటుంది. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని ఉంటే బెట‌ర‌ని సూచించారు. దీంతో ఇప్ప‌టికే అమ‌రావ‌తి విష‌యంలో అక్క‌డి ప్ర‌జ‌లు, రైతులు కూడా త‌మ‌కు రాజ‌ధాని ప్రాంత‌మే కావాల‌ని, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ చేసుకోవాల‌ని వారు ప‌ట్టుబ డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వారం రోజులుగా కూడా వారు ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు.

 

ఇక‌, ఇప్ప‌టికే మంత్రులు రాజ‌ధానిపై అనేక రూపాల్లో విమ‌ర్శ‌లు, క్లూలు ఇస్తున్నారు. అమ‌రావ‌తిలో ఏముంద‌ని ఒక‌రంటే.. ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెడితేనే త‌ప్ప అమ‌రావ‌తిలో నిర్మాణాలు ముందుకు సాగ‌వ‌ని కాబ‌ట్టి మారిస్తే.. త‌ప్పులేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే, క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని త‌ర‌లిస్తామ‌న్న వైసీపీ నాయ‌కులుఅక్క‌డ హైకోర్టు ఏర్పాటు.. అమ‌రావ‌తి, విశాఖ‌ల్లో బెంచ్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌డంపైనా మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. అదేవిధంగా విశాఖ‌లో సంబ‌రాలు చేసుకోవాల‌ని ఇప్ప‌టికే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పిలుపు నివ్వ‌డం కూడా వివాదానికి కార‌ణంగామారింది.

 

ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్వ‌హిస్తున్న కేబినెట్ భేటీలో రాజ‌ధాని అంశం చ‌ర్చ‌కు వ‌స్తుందా?  అనే విష‌యం ఉత్కంఠ‌గా మారింది. అయితే, రాజ‌ధాని స‌హా రాష్ట్రంపై బోస్ట‌న్ క‌మిటీ కూడా ప‌రిశీల‌న చేస్తున్న నేప‌థ్యంలో ఈ క‌మిటీ నివేదిక కూడా వ‌చ్చాక పూర్తి స్థాయిలో ప్ర‌భుత్వం దృష్టి పెడుతుంద‌నే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ రోజు.. రాజ‌ధానిపై ఇత‌మిత్థంగా క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గానే క‌నిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: