ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన  ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జగన్ మూడు రాజధానిలో ప్రకటనపై ప్రతి పక్షాలు విరుచుకుపడుతూ ఉంటే అటు  అమరావతి రైతులు అందరు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో  అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. మూడు  రాజధానిల  నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు. ఇకపోతే నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్యాబినెట్ లో చర్చించిన తర్వాత రాజదాని మార్పు నిర్ణయాన్ని మరికొన్ని రోజులకు వాయిదా వేసింది జగన్ సర్కార్ . అయితే క్యాబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 రాజధాని అమరావతి మార్పు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన కాదని ఏ వ్యవస్థ ఎక్కడ ఉండే  అవకాశం ఉందో వెల్లడిస్తూ కమిటీ నివేదికపై అంచనా మాత్రమే వేశారు అని  మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. న్యాయనిపుణుల సలహా మేరకే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు . చంద్రబాబు లోకేష్ లాగా అవసరాల కోసం అడుగులు వేసే ప్రభుత్వం తమది కాదని జిఎన్ రావు ఎంతో బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఆయన నివేదికను గౌరవించాలని సూచించారు మంత్రి పేర్ని నాని. ఎవరి కోసమో కాకుండా రాష్ట్ర పరిస్థితులను వాస్తవికంగా అధ్యయనం చేసి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. రాజధాని ప్రాంతం లోని 29 గ్రామాల రైతులకు గురుంచి  కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ని  పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

 

 

 అయితే అటు రాష్ట్ర ప్రజలందరూ రాజధాని మార్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో రాజధాని మార్పు పై నిర్ణయం  వాయిదా పడడంతో ఇప్పట్లో  ఈ ఉత్కంఠ కు తెరపడేలా  కనిపించడం లేదు. ఇకపోతే క్యాబినెట్ మీటింగ్ లో రాష్ట్రంలోని పంటకు గిట్టుబాటు ధర సహ మార్కెట్ యార్డ్ ల గురించి కూడా చర్చించారు. అంతేకాకుండా 104, 108 వాహనాల సంఖ్య  కూడా పెంచుతామని వెల్లడించారు మంత్రి పేర్ని నాని. అయితే క్యాబినెట్ మీటింగ్ తర్వాత అమరావతి రైతులకు ఏదో ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్న  నేపథ్యంలో రాజధాని మార్పు నిర్ణయం వాయిదా పడడంతో.. రాజధాని రైతుల నిరసన లు  మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: