మ‌రో టెలీకాం సంస్థ వినియోగ‌దారుల‌కు షాక్ ఇచ్చింది. తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం టారిఫ్‌ ప్లాన్లలో మార్పులు చేస్తున్న టెలీకాం కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్ సైతం చేరింది. ప్రీపెయిడ్ ప్లాన్ల‌లో మార్పులు చేసి తన వినియోగదారులకు పెద్ద షాక్‌ ఇచ్చింది. పాపులర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.558లో భాగంగా ఇప్పటి వరకు వినియోగదారులు 82 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజుకు 3జీబీ డేటాతో పాటు 100 ఎస్సెమ్మెస్‌ ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే,  రూ.558 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వ్యాలిడిటీని 82 రోజుల నుంచి 56 రోజులకు తగ్గించింది.  సవరించిన ప్లాన్‌ ప్రకారం ప్లాన్‌లో ఉన్న ఆఫర్లన్నీ ఇకపై కేవలం 56 రోజుల వరకే వర్తించనుంది. భారీగా కుధించిన ఈ తీరుపై స‌హ‌జంగానే వినియోగ‌దారులు షాక్‌కు గుర‌వుతున్నారు.

 

రూ.558ప్లాన్‌లో వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌, ఫాస్టాగ్‌లపై రూ.100క్యాష్‌బ్యాక్‌, షా అకాడమీలో నాలుగు వారాల ఉచిత కోర్సు తదితర సేవలు వినియోగదారులు అదనంగా పొందొచ్చు. నూత‌న షాకుల ప‌రంప‌ర‌లో భాగంగా, ఏకంగా 26 రోజులు కోత విధించడంపై ఖాతాదారుర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్రూలీ అన్‌లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్‌టెల్ ఇతర నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఎయిర్‌టెల్ ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన ప్లాన్ల వివ‌రాలివి


* రూ.219 - అన్‌లిమిటెడ్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా సరే), రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.399 - అన్‌లిమిటెడ్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా సరే), రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 56 రోజుల వాలిడిటీ
* రూ.449 - అన్‌లిమిటెడ్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా సరే), రోజుకు 2జీబీ డేటా, రోజుకు 90 ఎస్‌ఎంఎస్‌లు, 56 రోజుల వాలిడిటీ

మరింత సమాచారం తెలుసుకోండి: