కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ పై నిరసన సెగలు ఇప్పటికీ తగులుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఎనర్జీని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు పౌరసత్వ సవరణ చట్టం ఎనర్జీ పై వ్యతిరేక  స్వరం వినిపిస్తున్నారు. కొంత మంది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి అమలు చేయబోమని అంటూ తేల్చి చెప్పారు. దీంతో దేశంలో పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ  తీవ్రస్థాయిలో ప్రకంపనలు రేపుతున్నది .

 

 

 అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలందరి పై దాడి చేసేందుకు  మరో రంగం సిద్ధమైందని... ఎన్పిఆర్,  ఎన్ఆర్సి లు ప్రజలపై దాడి చేసేందుకు ఉద్దేశించినదేనంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకు లోకి వెళ్ళిన సామాన్య ప్రజలు డబ్బులు తీసుకోలేని  పరిస్థితులు ఏర్పడ్డాయని... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు  నిర్ణయంతో దేశం మొత్తం మీద 15 నుంచి 20 మంది ధనికులు  మాత్రమే లాభపడ్డారు అంటూ రాహుల్ గాంధీ తెలిపారు. ఇప్పుడు ఎన్పిఆర్ ఎన్ఆర్సి కూడా అలాంటిదేనని ఆయన విమర్శించారు. దేశ ప్రజలు తమ గుర్తింపు పత్రాలతో అధికారుల వద్దకు వెళితే వారు లంచం అడగడం ఖాయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

 

 

 ఒకవేళ పేద ప్రజలు లంచం ఇవ్వలేకపోతే ఆ పత్రాలను వాటిలో ఉన్న పేర్లను అధికారులు తారుమారు చేస్తారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో సామాన్య ప్రజలు తప్పక లంచాలను ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దీంతో మరోసారి పేద ప్రజల జేబులు ఖాళీ అవ్వటం తధ్యమని  రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసారి ఆ డబ్బంతా  15 మంది వద్దకే చేరుతుందని రాహుల్ విమర్శించారు. ఈ విధంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలపై  మరోసారి దాడి జరగనుందని వెల్లడించారు రాహుల్ గాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి: