రాజధాని ప్రాంతంలో జరిగినట్లు వైసిపి ఆరోపిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబునాయుడు ఇరుక్కోవటం ఖాయమేనా ?  చంద్రబాబు అండ్ కో పాల్పడిన ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ప్రభుత్వం అన్నీ ఆధారాలను సేకరించిందా ? అంటే ప్రభుత్వ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.   సిఆర్డీఏ పరిధిలో  చంద్రబాబుతో కలిసి టిడిపి ప్రముఖుల్లో ఎవరెవరు ఎన్నెన్ని ఎకరాలు కొన్నారు ? ఎవరెవరి పేర్లతో కొన్నారనే విషయంలో ప్రభుత్వం దగ్గర పక్కా ఆధారాలున్నట్లు  సమాచారం.

 

మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయమై ఆర్దికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి చాలా డీటైల్డ్ గా  వివరించారు.  సమావేశాల్లో బుగ్గన కొన్ని పేర్లను మాత్రమే చెప్పారు. కానీ బయటపడని పేర్లు ఇంకా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో  భాగంగా భారీ ఎత్తున భూములు కొన్నవారంతా తమ ఇళ్ళల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, పనివాళ్ళు, వంటవాళ్ళ పేర్లతోనే వాటిని కొన్నట్లు ఆధారాలు దొరికాయట.

 

ప్రభుత్వ లెక్కల ప్రకారం చంద్రబాబుతో కలిపి టిడిపిలోని ప్రముఖులు, సన్నిహితులు 4075 ఎకరాలను సొంతం చేసుకున్నారట.  చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్, ప్రచారంలో ఉన్న  లింగమనేని రమేష్, వేమూరి హరిప్రసాద్ కొనుగోలు చేసిన భూముల వివరాలకు ఆధారాలు దొరికినట్లు సమాచారం. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, రావెల కిషోర్ బాబు, మాజీ ఎంఎల్ఏలు దూళిపాళ్ళ నరేంద్ర, ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి లాంటి వాళ్ళ భూ భోగాతాలు బయటపడబోతున్నాయట.

 

టిడిపి ప్రముఖులు లబ్ది పొందటానికి  సిఆర్డీఏ పరిధని చాలాసార్లే మార్చారట. ఇందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ లాంటి వాళ్ళు లబ్ది పొందారట.  ఇన్ సైడర్ ట్రేడింగ్  ఓ పద్దతంటే ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సొంతం చేసుకోవటం ఇంకో మోసం. నిజానికి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములను ఎవరూ కొనటానికి వీల్లేదు. కానీ సుమారు 900 ఎకరాలను టిడిపి ప్రముఖులే కొనేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకనే ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసేసింది.

 

కోట్లాది రూపాయలు పెట్టి రాజధాని గ్రామాల్లో భూములు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఇచ్చిన  తెల్లరేషన్ కార్డుల జిరాక్స్ కాపీలను చూసి ప్రభుత్వమే ఆశ్చర్యపోయిందట. అంటే టిడిపిలోని ప్రముఖులే తమ బినామీల ద్వారా పెద్ద ఎత్తున భూములు కొన్న విషయం బయటపడిపోయింది. అందుకనే సిబిఐ విచారణ చేయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. చూద్దాం విచారణంటూ మొదలైతే ఇంకెన్ని విషయాలు బయటపడతాయో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: