ప్రకృతి విలయతాండవానికి మానవులు నిలువలేరని అనే సందర్భాల్లో నిరూపించబడుతుంది. మనిషి ఆర్ధికంగా ఎదుగు తున్నాడు, మితిమీరిన స్వేచ్చా భావంతో బ్రతుకుతున్నాడు. కాని ప్రకృతి ముందు ఎప్పటికి ఓడిపోతూనే ఉన్నాడు..

 

 

మానవజీవనానికి ప్రకృతి ప్రసాధించిన వనరులను నాశనం చేస్తూ తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. మనిషిలో పుట్టే ఆలోచనలే భావి తరాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయని ఈ సందర్భంగా ఎందరో మేధావులు చెబుతున్నారు. ఇకపోతే ప్రకృతివల్ల కలిగే నష్టం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది.

 

 

ఇంతగా ఎదుగుతున్న మనిషి అనుకోకుండా ప్రకృతి సృష్టించే వినాశనాన్ని పసిగట్టి తగిన చర్యలు తీసుకోలేక పోతున్నాడు. ఈ ప్రకృతి ప్రకోపానికి ఇప్పటి వరకు లక్షల మంది లక్షల మంది నిరాశ్రయులు కాగా, మరణించిన వారి గురించి చెబుతే లెక్కలు సరిపోవనిపిస్తుంది..

 

 

ఇకపోతే తాజాగా ఫిలిప్పిన్స్‌లో ఫాన్ఫోన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఫాన్ఫోన్ తుఫాను విరుచుకపడడంతో 30 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతైనట్టు సమాచారం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగు తున్నాయి. ముందస్తు చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికి 200 కిలో మీటర్ల వేగంతో గాలులు భీకరంగా వీయడంతో పాటు భారీ వర్షం కురుస్తుండడంతో మృతుల సంఖ్య బారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

 

 

ఇకపోతే 2013లో హేయాన్ తుఫాన్‌లో ఆరు వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎన్ని వచ్చినా గాని మనిషి వాటిని తట్టుకునే దిశగా మాత్రం అభివృద్దిని సాధించలేకపోతున్నాడు. అంటే ఒకరకంగా ప్రకృతి ముందు మనిషి తలవంచినట్లే. ఇప్పుడున్న మేధస్సు అంతా వెనకటి పుణ్యపురుషుల ముందు దిగదుడిపే అని అనుకుంటున్నారట కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: