ప్రపంచంలో మనుషుల పోకడ చాల చిత్రమనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకరితో సహజీవనం చేసే రోజులు పొయాయి. అలాగే భార్య భర్తలు అనే పదం కూడా మారిపోయింది. భారతదేశంలోనైతే ఇప్పటికే ఫారిన్ కల్చర్ వచ్చేసింది. ఇక ఫారిన్లో అమలయ్యే వివాహా వ్యవస్ద ఎంత దారుణంగా ఉంటుందో అందరికి తెలిసిందే. భర్తలుండ గానే భార్యలు.. భార్యలు ఉండగానే భర్తలు వేరేవారితో తమ శృంగార కోరికలు తీర్చుకోవడం అక్కడ సర్వసాధారణమే.
ఇక విడిపోవాలనుకుంటే మాత్రం మనదేశంలో లాగా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టు తిరగవలసిన అవసరం లేదట. అంటే ఎవరికి నచ్చినట్లుగా విచ్చలవిడిగా బ్రతకవచ్చన్న మాట. ఇది ఫారిన్ కల్చర్. ఇకపోతే ఈ ఫారిన్ కల్చర్ అని చెప్పుకునే, క్సియామెన్ నగరంలో ఓ సంఘటన జరిగి భార్య బండారం బయటపడింది. . ఒక మహిళ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిందట. వేర్వేరు పోలికలతో ఉన్న ఆ కవలల్లో ఒకరి డీఎన్ఏ మాత్రమే తండ్రి డీఎన్ఏతో కలిసింది. దీంతో షాకైన ఆమె భర్త ఆమెను నిలదీయగా.. అసలు విషయం బయటపడింది.
తనకు పుట్టిన కవలల్లో ఒకరు వేరే వ్యక్తికి పుట్టినవాడని చావుకబురు చల్లగా చెప్పింది. ఈ తతంగమంతా తమకు పుట్టిన కవల పిల్లల వివరాలను పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించడానికి వెళ్లిన సందర్భంగా బయట పడ్డది.. ఇకపోతే ఆ కవలల్లో ఒక బిడ్డ డీఎన్ఏ తండ్రి డీఎన్ఏతో కలవకపోవడంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా భార్య తాను ఓ వ్యక్తితో ‘వన్ నైట్ స్టాండ్’ లో పాల్గొనడం వల్ల అలా జరిగి ఉండవచ్చని పేర్కొంది. ఆమె సమాధానం విని భర్త షాకయ్యాడు.
వేరే వ్యక్తితో శృంగారం మాట పక్కన పెడితే.. ఇద్దరు వ్యక్తుల వీర్యంతో కవలలు పుట్టడం ఎలా సాధ్యమో తెలియడం లేదని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారట.. ఇక ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్య నిపుణులు తెలిపారు. ఒకే రోజులో మహిళ అండోత్పత్తికి ముందు లేదా తర్వాత వేర్వేరు వ్యక్తులతో శృంగారంలో పాల్గొన్నట్లయితే ఇలా జరుగుతుందని, వైద్య పరిభాషలో దీన్ని హెటెరోప్తెరనల్ సూపర్ఫెకండేషన్ అంటారన్నారు. ప్రతి 13వేల జంటల్లో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని పేర్కొన్నారు..