ప్రపంచంలో తొలి మానవుడు ఎక్కడ ఆవిర్భవించాడు.  ఎక్కడ సంచరించాడు.  ఎలా ఉన్నాడు అనే విషయాల గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.  ఇలా తెలుసుకునే క్రమంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. మొదటి మనిషి ఆఫ్రికా ప్రాంతంలో సంచరించారు.  అప్పట్లో ఇప్పటిలా ఏడు ఖండాలు లేవు.  భూమి మొత్తం ఒకే ఖండంగా ఉండేది.  కానీ, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాల తరువాత భూమి ఏడు ఖండాలుగా విడిపోయింది.  


అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు.  ఎన్నో ఆవిష్కరణలు.. వీటన్నింటికి మించి సాంకేతికంగా మనిషి ఎదిగాడు.  మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకున్నాడు.  ఇదంతా నాణానికి ఓ కోణం.  మరో కోణమే విపరీతంగా భయపెడుతున్నది.  మనిషి ఎంతగా అభివృద్ధి చెందుతున్నాడో అంతే... వినాశం వైపుకు పరుగులు తీస్తున్నాడు.  అత్యాచారాలు, హత్యలు, ఉగ్రవాద చర్యలు ఇవన్నీ ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాయి.  


ముఖ్యంగా ప్రపంచాన్ని ఉగ్రవాద చర్యలు భయపెడుతున్నాయి.  ఈ ఉగ్రవాదుల కారణంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు.  ఆసియాలో ఇస్లామిక్ గ్రూప్ ఉగ్రవాదుల అలజడి మాములుగా ఉండటం లేదు.  ఆసియాతో పాటుగా ఈ ఉగ్రవాదులు ఆఫ్రికా దేశంలో కూడా దాడులు చేస్తున్నారు.  ఇటీవలే ఆఫ్రికా దేశం బుర్కినా ఫెసో దేశంలో ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.  ఈ ఉగ్రవాదుల దాడుల్లో దాదాపుగా 45 మంది సామాన్య పౌరులు, సైనికులు మరణించారు.  సైన్యం జరిపిన ఎదురు దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు.  


ఇదిలా ఉంటె బుర్కినా ఫెసో కు బోర్డర్ లో ఉన్న నైగర్ దేశంలో కూడా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  సామాన్యులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు.  ఈ దాడుల్లో అనేకమంది పౌరులు మరణిస్తున్నారు.  అసలే ఆఫ్రికా దేశం.  తినడానికి తిండి లేని దేశం.  కానీ, ఆధిపత్యం కోసం జరిగే పోరాటం మాత్రం రక్తసిక్తంగా మారిపోతున్నది.  ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూ పొతే చివరకు ఎక్కడైతే మనిషి ఆవిర్భావం మొదలైందో అక్కడే అంతం అయ్యేలా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: