తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్న వార్త ఏమైన ఉన్నదంటే కేటీఆర్‌ త్వరలో సీయం పీఠాన్ని అధిరోహిస్తున్నాడనే విషయం పలు విధాలైన చర్చలకు దారి తీస్తుందట.. అంతే కాకుండా ఈ విషయాన్ని ఈమధ్యనే ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసిందట.. ఇకపోతే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడని గత లోక్‌సభ ఎన్నికల ముందు తీవ్రంగా ప్రచారమైంది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయి, అక్కడ తలమునకలైపోయి చక్రం తిప్పుతారని, రాష్ట్రంలో కుమారుడు కేటీఆర్‌ సీఎంగా చక్రం తిప్పుతాడని కూడా ప్రచారమైంది.

 

 

సరే…తరువాత కేసీఆర్‌ అంచనాలు తప్పిపోయి ఆయన మళ్లీ సీఎంగానే ఉన్నారు. మరో ప్రచారం ఏమిటంటే…రాష్ట్ర మంత్రి కమ్‌ కేసీఆర్‌ మేనల్లుడు హరీష్‌రావు ఏనాటికైనా మామకు వెన్నుపోటు పొడిచి తానే అధికారంలోకి వస్తాడని కొందరు అభిప్రాయ పడుతున్నారట.. అయితే హరీష్‌ రావు ఏం చేస్తాడో ఇప్పుడు ఊహించడం అనవసరం అని. ఇప్పటి వరకైతే ఇలా అనడానికి సరైన ఆధారాలు, సంకేతాలు లేవు. కాని కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి చాలా సంకేతాలున్నాయంటున్నారు. అదేమంటే మొదటిది ఆయన కేసీఆర్‌ కుమారుడు కావడానికి మించిన అర్హత మరొకటి లేదట.

 

 

ఇది కాకుండా మంత్రిగా, పార్టీ నాయకుడిగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుని ఉన్నాడు కాబట్టి ఒకవేళ కేసీయార్ ఇచ్చిన బాధ్యతలను పరిపాలనపరంగా, రాజకీయంగా విజయవంతంగా నిర్వర్తించాడు. ఇకముందూ చేస్తాడు అనే నమ్మకం పార్టీ వర్గాల్లో క్రమక్రమంగా కలిగిందట.. మరి ఇలాంటి పరిస్దితుల్లో కొత్త ఏడాదిలోనే కేటీఆర్‌కు పీఠం అప్పగిస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి వస్తోందట…!

 

 

ఇప్పుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాటలు ఆంగ్ల పత్రిక కథనానికి అనుగుణంగానే ఉన్నాయి. కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా నియమించినప్పుడు మీడియావాళ్లు ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చారు. దానికి కేటీఆర్‌ సమాధానమిస్తూ తనను తాను నిరూపించుకున్నానని, సవాళ్లను స్వీకరించి వాటిని పూర్తి చేశానని చెప్పాడు. ఇకపోతే ఇప్పటికే అంటి అంటనట్టుగా ఉంటున్న హరీష్ రావు భవిష్యత్తును ఇక కేటీయార్ నిర్ణయిస్తారని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: