కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే  పనిని లక్ష్యంగా పెట్టుకొని కావాలనే వారు  అనవసరమైన చట్టాలను రూపొందిస్తోందని ఆరోపించారు. జాతీయ గిరిజన నృత్య మహోత్సవంలో రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ  జాతీయ గిరిజన నృత్య మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై భారీ ఎత్తున విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్బంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ. . బీజేపీ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనను ఎంతో  మనోవేదనకు గురిచేశాయని  ఆవేదన వ్యక్తం చేశారు. 

 

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా చట్టాలను కూడా రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు.  ఏ చిన్న పొరపాటు  ఐనా సరే పత్రాలలో జరిగినా ప్రజలు లంచం ఇవ్వాల్సిన పరిస్థితిని కలిపించారు అని ఆయన  అన్నారు. ఇది ప్రజలపై దాడి చేయడమేనని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా.. ఇవేవి ప్రధాని నరేంద్ర మోదీకి అస్సలు  అర్థం కావడం లేదని  రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్  రాహుల్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్  దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాడు. ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పీఆర్‌పై  తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు ఉందని పేర్కొన్నారు. ఎన్‌పీఆర్ ఎలాంటి ద్రవ్య లావాదేవీలను జరపదని, కేవలం పేదలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని వివరించారు. 

 

2010నుంచి జరుగుతున్న విధానాన్నే తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎప్పుడూ అబద్దాలు ఆడేవారని,  అధ్యక్షుడిగా లేని సమయంలో కూడా అదే కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్  ఎద్దేవా చేశారు.   కాగా తమ పార్టీ వ్యాఖ్యలు రాహుల్‌ను ఇబ్బంది పెట్టాయన్న ఆరోపణలకు స్పందిస్తూ..రాహుల్‌ వ్యాఖ్యలు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయని సమాధానమిచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: