టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అనే వివాదాస్పద సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా పలువురు రాజకీయ నాయకులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు వర్మ. రిలీజ్ కు ముందు కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న ఆ సినిమా, ఎట్టకేలకు వాటిని అన్నిటినీ అధిగమించి ఇటీవల ఫైనల్ గా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ తరువాత మాత్రం అంచనాలను అందుకోవడంలో ఆ సినిమా పూర్తిగా విఫలం అయింది. ఇక ప్రస్తుతం ది గర్ల్ డ్రాగన్, అలానే బ్యూటిఫుల్ అనే సినిమాలు నిర్మిస్తున్నారు వర్మ. కాగా వాటిలో బ్యూటిఫుల్ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

నయనా గంగూలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా వివరాలు గురించి మాట్లాడడానికి సినిమా యూనిట్ నేడు విశాఖపట్నంలో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. కాగా ఆ సమావేశంలో మీడియాతో ప్రేత్యేకంగా ముచ్చటించిన వర్మ, కొందరు విలేకర్లు ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతం అమరావతిలో రాజధాని విషయమై పోరాటాలు జరుగుతున్నాయి కదా, వాటిపై మీ అభిప్రాయం ఏంటని అడుగగా, వర్మ రాజధాని అమరావతిపై కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ, రాజకీయాలతో సంబంధం లేని ప్రజలకు రాజధాని ఎక్కడ ఉంటె ఏంటని, గతంలో తాను ఒకసారి ఆంధ్రకు రాజధానిగా అమరావతి ఉండాలన్న విషయాన్ని గుర్తుచేసుకున్న వర్మ

 

అది అప్పట్లో తాగిన మైకంలో చేసిన వ్యాఖ్య అని, కావాలనే పబ్లిసిటీ కోసమే అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు., ప్రజలకు రాజధాని అనేది మన రాష్ట్రంలో ఉంటె ఏంటి, లేక ప్రక్క రాష్ట్రంలో ఉంటె ఏంటి చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి తనకు ఇటువంటి వాటిపై అవగాహన లేదని, అందువలన తాను ఇంతకంటే ఏమి మాట్లాడలేనని అన్నారు.కాగా రాజధానిపై వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుండగా, చాలామంది ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇది ప్రజల మనోభవాలకు, రాష్ట్ర పరిస్థితులకు సంబందించిన విషయం అని, దీనిపై వర్మ గారు ఇలా వ్యంగ్యంగా మాట్లాడడం తగదని, తనకు ఇటువంటి వాటిపై అవగాహన లేదనుకున్నపుడు సైలెంట్ గా ఉండాలని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వర్మపై కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. అసలే రాజధాని విషయమై కొంత ఆందోళన జరుగుతున్న ఈ సమయంలో వర్మ ఈ విధంగా వ్యంగ్యంగా ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సరైనది కాదని కొందరు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: