జరిగిన ఘటన... 

గత నెల 27న దేశాన్ని కాల్చివేసిన ఘటన హైదరాబాద్, షాద్ నగర్ లో జరిగింది. ఆ ఘటన చుసిన ప్రతి ఒక్కరికి కంట నీరు ఆగదు. ఆ ఘటనే దిశ ఘటన. చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ వైద్యురాలైన దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి సజీవ దహనం చేశారు. 

 

అయితే ఘటన జరిగిన 24గంటల్లోనే పోలీసులు ఆ నిందితులను పట్టుకోగా.. వారే అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారిని హైకోర్టులో హాజరుపరచగా నలుగురిని 14 రోజులు రిమాండ్ లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అయితే పోలీసులు విచారణలో భాగంగా కేసు రీకాన్స్ట్రక్షన్ లో భాగంగా వారిని ఘటన స్థలానికి తీసుకెళ్లగా అక్కడ పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. 

 

దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నలుగురు నిందితులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో నలుగురు నిందితులు మృతిచెందారు. ఇంకా అక్కడే ఆ నిందితులకు పోస్టుమార్టం చేశారు. అయితే ఆ నిందితుల ఎన్కౌంటర్ పై మహిళా సంఘాలు కోర్టులో పిటిషన్ వెయ్యగా ఆ నలుగురి అంత్యక్రియలు పూర్తవుతాయి అనుకున్న సమయంలో కోర్టు అంతక్రియలకు బ్రేక్ వేసింది. 

 

ఆతర్వాత మానవ హక్కుల సంగం బరిలోకి దిగి విచారణ జరపగా.. కోర్టు విచారణ జరిపి జరిపి నాలుగు రోజుల క్రితం ఆ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసి నిందితులకు వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపారు. దీంతో ఈ కేసు ఇక్కడికి క్లోజ్ అని అందరూ భావించారు. 

 

ప్రస్తుతం.. 

 

కానీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.. అది ఎలా అంటే.. మన పెద్దలు అంటూ ఉంటారు.. ఎవరి శాపం తగిలిన మనం ఆనందంగా జీవించగలం కానీ ఆడపిల్ల శాపం తగిలితే నాశనం అవుతాం అని.. ఈ మాట ఇప్పుడు ఉపయోగించకూడదు కానీ.. తప్పటం లేదు. కనీసం ఈ కుటుంబం కష్టం చూసి అయినా కొందరైనా కామాంధులు మారుతారు అని ఆశిద్దాం. 

 

అతను ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి హత్య చేసి కనీసం తల్లితండ్రులకు చివరి చూపు కూడా లేకుండా పెట్రోల్ పోసి తగలెట్టేశాడు. ఒక్క అతను మాత్రమే చెయ్యలేదు.. మిగితా ముగ్గురు చేశారు.. కానీ ఎందుకో ఆ నిందితుడి కుటుంబాన్ని ఆ శాపం వెంటాడుతుంది. అతనికి తల్లితండ్రి.. భార్య అందరు ఉన్నారు.. 

 

ఇప్పుడు వారందరు ఆనాధలు అయ్యారు. అతని భార్య ఇప్పుడు నిండు గర్భిణీ. ఇలాంటి సమయంలో ఇప్పటికే అతను మృతికి తల్లితండ్రులు గుండెలు బాదుకుంటుంటే ఇప్పుడు మళ్ళి అతని తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ప్రస్తుతం వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క నెలలోనే ఇన్ని ఘోరాలు ఎలాంటి కుటుంబాన్ని అయిన ముంచేస్తుంది. ఈ కుటుంబాన్ని చూసి అయినా కాస్త మారండి.   

మరింత సమాచారం తెలుసుకోండి: