తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు  కేసీఆర్ తరువాత కేటీఆర్ చేపట్టనున్నారని, ఈ విషయం చిన్న పిల్లవాన్ని అడిగిన చెబుతారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ లో కొత్త చర్చకు దారితీశాయి . మున్సిపల్ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను కేసీఆర్, కేటీఆర్ కు  అప్పగించనున్నారన్న ప్రచారం జోరందుకుంది . ఇటీవల కేసీఆర్ సూపర్ సీఎం గా కొనసాగుతూ , కొడుకుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నారన్న ఊహాగానాలు వినిపించిన విషయం తెల్సిందే .

 

 తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి , కేసీఆర్ దానికి చైర్మన్ గా వ్యవహరిస్తారని , మండలిలో ముఖ్యమంత్రి కూడా సభ్యుడిగా ఉండనున్నారని జాతీయ దినపత్రికలు కథనాలు ప్రచురించాయి . గతం లో కేంద్రం లో యూపీఏ తరహా పాలనే రాష్ట్రం కొనసాగనుందని పేర్కొన్నాయి . యూపీఏ  ప్రభుత్వ హయాం లో  ప్రధాని గా మన్మోహన్ సింగ్ కొనసాగినప్పటికీ , కీలక నిర్ణయాలన్నీ యూపీఏ చైర్ పర్సన్ గా వ్యవహరించిన సోనియా గాంధీ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెల్సిందే . ఇక తెలంగాణ లో అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి దాని చైర్మన్ హోదా లో కేసీఆర్ , కేటీఆర్ పాలనా లో కు చేదోడు , వాదోడుగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు విన్పించాయి . అయితే ఈ ఊహాగానాలపై పార్టీ నాయకత్వం ఇప్పటి వరకు స్పందించలేదు .

 

 అయితే తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియా తో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ...  ముఖ్యమంత్రి పీఠం పై త్వరలోనే కేటీఆర్ ను   కూర్చోబెట్టడం ఖాయమన్న సంకేతాలను ఇచ్చాయి. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే . ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యత అంత కేసీఆర్ , కేటీఆర్ భుజస్కందాలపైనే పెట్టారు . ఎలాగో రాష్ట్రం లో ప్రస్తుత పరిస్థితుల్లో టీఆరెస్ మెజార్టీ స్థానాలు గెల్చుకునే అవకాశముంది . ఇదే అదనుగా కుమారుడికి కేసీఆర్ పట్టాభిషేకం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: