రాజకీయాల్లో గాని, సినిమాల్లో గాని తరచుగా వినబడే మాట గతంలో అందరూ తనను వాడుకొని వదిలేశారని, ఈ పదాన్ని ప్రతివారు ఎప్పుడొ ఒకప్పుడు వాడుతూనే ఉంటారు. ఇకపోతే సినిమాల్లో మాత్రం ఈ పదం ప్రతి రోజు ఎవరో ఒకరి నోటి నుండి వినవస్తూనే ఉంటుంది.

 

 

ఇదిలా ఉండగా తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందరూ నన్ను వాడుకొని వదిలేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వదించారని, ఈ వాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. నిన్న అనగా శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన రెండో విడత ‘పల్లె ప్రగతి’అవగాహన కార్యక్రమంలో మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

 

 

అంతే కాకుండా తెలంగాణ వస్తే నాడు అసెంబ్లీలో కరెంటు రాదని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.. నేడు తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్‌ 24 గంటల కరెంటు అందిస్తూ మహాత్ముడు అయ్యాడని పేర్కొన్నారు.

 

 

తెలంగాణ రాష్ట్రాన్ని క్రమక్రమంగా సీయం కేసీయార్ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడని. ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు.

 

 

ఇవే కాకుండా డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు నిర్మించిన పంచాయతీలకు రూ.84 కోట్లను విడుదల చేసిందని, టాయిలెట్లు నిర్మించుకున్న వారికి చెల్లించాల్సిన నిధులను పది రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు. ఇదే కాకుండా గ్రామాల్లో చెత్త వేసే వారికి నోటీసులు ఇవ్వాలని, ఫైన్లు వేయకుండా నిర్లక్ష్యం వహించే సర్పంచ్, కార్యదర్శి పదవులను కత్తిరించే అవకాశం ఉందన్నారు.

 

 

ఇందుకు గాను పది మండలాలకు కలిపి ఒక అధికారిని ఏర్పాటు చేశామని, నిర్లక్ష్యం ఎవరు చేసినా బాధపడాల్సి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: