మహారాష్ట్రలో ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత ఎత్తులు పై ఎత్తుల తర్వాత ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారు ఉద్ధవ్ థాక్రే. కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన పార్టీ. ఇకపోతే ఇక ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శివసేన బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత పడ్నవీస్ కు  మహారాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. థానే  మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు.అయితే యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ లో పనిచేస్తున్నారు అమృత పడ్నవీస్. అయితే ఈ జీవితాలను యాక్సిస్ బ్యాంక్ నుంచి కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న మరో బ్యాంకు మార్చ పోతున్నట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నరేష్ మాస్కె  ప్రకటించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత పడ్నవీస్ కు  షాక్ తగిలినట్లయింది. 

 

 

 యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ లో అమృత ఫడ్నవీస్  పని చేస్తుండడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు ఇటీవలే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను సవార్కర్ ను కాదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు.సావర్కర్  గురించి రాహుల్ కు ఒక్క ముక్క కూడా తెలియదు అంటూ ఎద్దేవా చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ఇక ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత పడ్నవీస్ థాకరే  పేరు తగిలించుకున్నంత  మాత్రాన అందరూ థాకరే లు  కాలేరు అంటూ  ఉద్ధవ్ థాకరే ను ఉద్దేశించి పలు విమర్శలు చేసింది. 

 

 

 

 దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవీస్ ట్విట్ పై శివసేన మహిళా నేత ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ ఘాటుగా బదులిచ్చారు. ఉద్ధవ్ థాకరే పేరుకు తగ్గట్లుగానే జీవిస్తున్నారని ఆమె తెలిపింది. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేమం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పనిచేస్తున్నారని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. అయితే అమృత పడ్నవీస్  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ను విమర్శించిన కారణంగానే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అమృత ను టార్గెట్ చేసిన ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగుల వేతనాలు యాక్సిస్ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు  మర్చపోతున్నది  అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: