అతను ఎమ్మెస్సీ, బీఈడీ చదివాడు. కానీ ఎం లాభం ఆ చదువుకు తగ్గ ఉద్యోగం ఎక్కడ రాలేదు. ఒక ఉద్యోగం వచ్చింది. అది కూడా ప్రైవేట్ ఉద్యోగం. రెండు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా కొనసాగాడు.. కానీ అది అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో వ్యవసాయంలోకి దిగాడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఈతరం నిరుద్యోగ యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ మండలంలోని దండెంపల్లి గ్రామానికి చెందిన బిట్ల నర్సిరెడ్డి అనే ఓ యువ రైతు వ్యవసాయం మీద ప్రేమ పెంచుకున్నడు. అతనికి ఉన్న ఆరు ఎకరాల భూమిలో రెండెకరాలు పందిరి విధానంలో తీగజాతి కూరగాయల సాగు చేపడుతూ రోజుకు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు ఆదాయం పొందుతున్నాడు. 

 

పందిరి విధానంలో రెండెకరాల భూమిలో కూరగాయల సాగు చేపట్టాడు. మొత్తం తీగజాతికి చెందిన బీర, కాకర, సొరకాయ, ఖీరా, పొట్లకాయ వంటి కూరగాయల సాగును చేపట్టి 360 రోజులూ దిగుబడి వచ్చేలా సాగు చేశాడు. పందిరి విధానంలో సాగు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందుతున్నాడు. 

 

పందిరి కింద భోజలు పోసి ఒక భోజను ఖాళీగా ఉంచి మరో భోజలో విత్తనాలు నాటాడు. దిగుబడి పూర్తి కావచ్చే నెల రోజుల్లో ఖాళీగా ఉన్న భోజలో మరో రకం కూరగాయల సాగు చేపడతాడు. దీనికి ఫలితంగా ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి లభిస్తుంది. రోజు ఆ కూరగాయలను నల్లగొండ మార్కెట్‌లో అమ్ముతాడు. 

 

అయితే ఇలా వ్యవసాయం చెయ్యటం వల్ల ఉద్యోగం రాకపోయినా సరే ఉద్యోగులకు వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు ఆ యువ రైతు. ఏడాదికి రెండెకరాల పందిరి కూరగాయల సాగు ద్వారా దాదాపు 5 లక్షలకుపైగా ఆదాయాన్ని చూస్తున్నాడు. చూశారా.. ఉద్యోగం రాకపోతే ఏం ? వ్యవసాయం ఉంది... భూమిని నమ్ముకున్న వారు ఎవరైనా సరే సంతోషంగా ఉంటారు అని నర్సి రెడ్డి కథ చదివితే అర్థం అవుతుంది. నిరుద్యోగ యువతకు స్ఫూర్తి ఈ నర్సిరెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: