2019 వ సంవత్సరం మరో మూడు రోజుల్లో పూర్తవ్వబోతున్నది.  2020 సంవత్సరంలో కొత్త ఆశలతో కొత్త ఆశయాలతో స్వాగతం పలికేందుకు ప్రపంచం సిద్ధం అవుతున్నది.  ప్రపంచంలో ఒక మనిషి కావాల్సింది కూడు, గుడ్డ, గూడు.  ఈ మూడు నిత్యావసరం ఇప్పుడు.  అయితే, తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్ట అందరికి ఉన్నది.  కానీ, ఉండేందుకు గూడు అందరికి దొరకడం లేదు.  నానా ఇబ్బందులు పడుతున్నారు.  అద్దె ఇళ్లల్లో, ఇరుకు గదుల్లో మగ్గుతున్నారు.  


ఇలా ఇరుకు గదుల్లో ఉండటం ఎంత కష్టమో అందరికి తెలుసు.  డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు.  ఎంత పెద్ద ఇళ్లైనా కట్టుకోవచ్చు.  ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అనేవారు.  ఇల్లు కట్టడం ఇప్పుడు ఈజీ.  డబ్బు చేతిలో ఉంటె చాలు.  కట్టిన ఇల్లు దొరుకుతున్నాయి.  చేతిలో దండిగా డబ్బు ఉంటె అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కునే బదులుగా చాలామంది విల్లాలు కొనుక్కుంటున్నారు.  


కానీ, ఇప్పుడు విల్లాలు కూడా దొరకడం లేదు.  అందుకే ఇప్పుడు వీటి స్థానంలో విల్లామెంట్ అనేవి కొత్తగా వచ్చాయి.  చూడటానికి ఇవి అపార్ట్మెంట్ లా ఉంటాయి.  కానీ, అపార్ట్మెంట్ కాదు.  అందులో రెండు రెండు ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి.  విల్లామెంట్ లు రెండు ఫ్లాట్ లు మాత్రమే ఉంటాయి.  విల్లాల్లో ఉండే అన్నిరకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.  వీటి ధర కూడా కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో ఉంటుంది.  


ఇప్పుడు విల్లా ధరలు అమాంతం పెరిగిపోవడంతో అందరు విల్లామెంట్ ల వైపుకు చూస్తున్నారు.  ఎందుకంటే వీటిల్లో భద్రత ఉంటుంది.  కుటుంబ సభ్యులు అందులోనే ఫ్లాట్స్ కొనుక్కుంటే అందరూ ఒకేచోట ఉండొచ్చు అనే ఆలోచన కూడా ఈ విల్లామెంట్ ల రూపకల్పనకు దారితీసింది.  నగరంలో ఇప్పుడు వీటి హవా పెరిగింది.  వీటికే డిమాండ్ పెరుగుతుండటంతో 2020లో వీటినే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారనడంలో సందేహం అవసరం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: