భారత దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. విడాకులు తీసుకున్న మహిళలను.. భర్త పెట్టె బాధలు భరించలేక దూరంగా ఉన్న మహిళలను చీడపురుగులాల చూసే ఈ సమాజంలో మొదటిసారి విడాకులు తీసుకున్న మహిళలకు మంచి జరుగుతుంది. కారణం ఏదైనా అవ్వచ్చు భర్తలకు విడాకులు ఇచ్చిన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పాడు ఓ సీఎం. అయితే మన తెలుగు రాష్ట్రాల సీఎం కాదు చెప్పింది.. ఉత్తరప్రదేశ్ సీఎం గుడ్ న్యూస్ చెప్పాడు. 

 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలతో పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రిపుల్ తలాఖ్ పొందిన వివాహితలకు పునరావాసం కల్పించాలని ఒక్కొక్కరికి 2020 నుంచి ప్రతి సంవత్సరం ఆరువేల రూపాయల ఆర్థికసాయం అందిస్తుందని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ప్రకటించారు. 

 

అంతేకాదు ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయసహాయం అందిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ట్రిపుల్ తలాఖ్ పొందిన ముస్లిమ్ మహిళలు దాదాపు 5వేల మందికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. 

 

దీంతోపాటు ఇతర మతాల్లో విడాకులు తీసుకున్న మహిళలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని సీఎం యోగి నిర్ణయించారు. ట్రిపుల్ తలాఖ్ పొందిన మహిళలు పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లను ఇస్తే చాలు ఈ పథకం కింద సర్కారు ఆర్థికసాయం అందజేయనుంది. 

 

అయితే ఈ సంచలన ప్రకటన విని ప్రజలు అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలారు. పక్క రాష్ట్రాల మహిళలు కూడా ఇలాంటి ప్రకటన చేస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు. దీంతో విడాకులు తీసుకున్న మహిళలకు గుడ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: