ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రాజధాని అంశం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయా ల్లో  ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమరావతి లో కూడా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పటికీ మూడు రాజధానిల నిర్ణయంపై స్పష్టత మాత్రం రాలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్ పై మరింత విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా మూడు రాజధానుల అంశం గురించి టిడిపి నేత దేవినేని ఉమా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ  కీలక నేత దేవినేని  ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

 విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ మధ్యలో కూర్చుని వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖను రాజధానిగా ప్రకటించారని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. అసలు విజయసాయిరెడ్డి ఏ అర్హతతో  రాజధానిని ప్రకటించారు అంటూ ఆయన ప్రశ్నించారు. దొంగ లెక్కలు రాసేవాడు.. జైలుకు వెళ్లిన వాడు తమ రాష్ట్ర రాజధానిని ప్రకటిస్తాడా  అని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని ఉమా. వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డికి ఎంత ధైర్యం ఎంత కండ కావరం ఎంత అహంకారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి నేత దేవినేని ఉమ. 

 


 అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనా లేక విజయసాయిరెడ్డా  అని ప్రశ్నించారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ మంత్రి వాడెవడు విజయసాయి రెడ్డి అని మాట్లాడారు అంటూ దేవినేని ఉమ ఆరోపించారు. రాజధాని ఆయన ప్రకటిస్తే మాకేంటి సంభంధం అని మంత్రి వ్యాఖ్యానించారని దేవినేని ఉమ తెలిపారు. అదీ క్యాబినెట్ మీటింగా  లేక కామెడీ నా అనేది అర్థం కావడం లేదంటూ దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడుని తిట్టేందుకు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలా  అంటూ నిలదీశారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయాలనే వ్యాఖ్యలను ఖండిస్తారా  లేదా అనే విషయాన్ని జగను ప్రశ్నిస్తున్నమంటూ దేవినేని ఉమ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: