దేశంలో పౌరసత్వం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీలకు పౌరసత్వం కల్పించే విషయంలో ఈ చట్టం తీసుకొచ్చారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం కావాలని, ఆ మూడు దేశాల నుంచి వచ్చే మైనారిటీలకు ఇండియా పౌరసత్వం కల్పించాలని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో పేర్కొన్న సంగతి తెలిసిందే.  


దానినే ఇప్పుడు కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది.  కానీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ఈ చట్టాన్ని రద్దు చేయాలనీ, దీని వలన ప్రజలు ఇబ్బందులు పడతారని, దేశాన్ని బీజేపీ ప్రభుత్వం హిందూ, ముస్లింలుగా విభజించాలని చూస్తోందని ఆరోపంచింది.  కానీ, కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు.  దీంతో దేశంలో అలజడులు జరిగాయి.  ముఖ్యంగా యూపీలో నిరసనలు ఉద్రిక్తంగా మారడం, నిరసనకారులు ప్రజా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.  


దీనిపై కేంద్రం యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని, ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి వారి ఆస్తులను వేలం వేసి వచ్చిన డబ్బుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టపరిహారంగా తీసుకుంటామని హెచ్చరించింది.  ఆస్తుల ధ్వంసానికి కారణమైన వ్యక్తుల వీడియోలను, ఫోటోలను ప్రభుత్వం బయటపెట్టింది.  


ఎక్కడ తమ ఆస్తులు వేలం వేస్తారో అని భయపడిన ఆందోళన కారులు, తమ తప్పు తెలుసుకొని స్వచ్చందంగా వివారాలు ఇవ్వడం మొదలుపెట్టారు.  పోలీస్ జీబుకు ను తగలబెట్టిన దానికి ఫలితంగా అలాంటి మరో కారు కొని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.  బులందర్ జిల్లాలోని ఉపిరికోటకు చెందిన ప్రజాప్రతినిధులు, కొంతమంది ఆందోళన కారులు వచ్చి రూ. 6.27 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.  ఎప్పుడు ఇలాంటి ఆందోళనలు చేయబోమని ప్రతిజ్ఞ చేశారు.  ఇంకా యూపీలో మొత్తం రూ. 50 లక్షలకు పైగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి.  వీటిని కూడా ఆందోళనకారుల నుంచి రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: