తెల్లరేషన్ కార్డుదారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని తెల్లరేషన్ కార్డుదారులు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు నివేదికలో వెల్లడి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల రాజధాని భూ కుంభకోణంలో బట్టబయలయ్యాయి. టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొనుగోలు చేసినట్లు కమిటీ నిర్ధారించినట్టు సమాచారం. ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటపెట్టిన సబ్ కమిటీ... 4,075 ఎకరాల భూముల టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు తేల్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్‌ భారీ భూ కొనుగోళ్ల వివరాలను కమిటీ తన నివేదికలో పొందుపర్చినట్టు తెలుస్తోంది. అప్పటి మంత్రులు పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీ నేతల అమరావతిలో భూములు కొన్నట్టు నివేదికలో వెల్లడించినట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలల క్రితమే సబ్ కమిటీ వేశారు. తాజాగా ఈ సబ్ కమిటీ సీఎం జగన్‌తో సమావేశమైంది.

చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏసీబీ, విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు ఈ నివేదిక రూపొందించినట్టు సమాచారం. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వెల్లడించిన కేబినెట్ సబ్ కమిటీ.  టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ.

ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటపెట్టిన సబ్ కమిటీ. 4,075 ఎకరాల భూముల టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు నివేదిక. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్ ల భారీ భూ కొనుగోళ్ల వివరాలతో సహా నివేదిక. అప్పటి మంత్రులు పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీ నేతల భూ మాయ బట్టబయలు చేసిన సబ్ కమిటీ. సీఆర్డీఏ పరిధిని ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం పలుమార్లు మార్చినట్లు ఆధారాలు గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ. ఎస్సీ, ఎస్టీ నుంచి 900 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు సబ్ కమిటీ నివేదికలో వెల్లడి. 

-

మరింత సమాచారం తెలుసుకోండి: