హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ తిరంగ ర్యాలీకికి ఏర్పాట్లు చేసినా పోలీసులు అనుమతి లేదని చెబుతున్నారు. ఏం చేసినా సరే ర్యాలీ చేసి తీరతామని చెప్పటంతో భారీగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 
పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ చేపట్టదలచిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి నిరాకరించటంతో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు ఉపక్రమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం సేవ్ నేషన్ - సేవ్ కాన్ స్టిట్యూషన్ పేరుతో గాంధీ భవన్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించగా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 
 
పోలీసులు కాంగ్రెస్ నేతలు బయటకు రాకుండా భారీ బందోబస్త్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా పోలీసుల తీరును నిరసిస్తూ సత్యాగ్రహ దీక్షకు దిగారు. 24 గంటలపాటు గాంధీభవన్ లోనే దీక్ష కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కుంతియాలు దీక్షలో పాల్గొన్నారు. 
 
అంతకుముందు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను గాంధీ భవన్ లో ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రస్తావించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాల వలన దెబ్బతినిందని ఉత్తమ్ అన్నారు. కేంద్రం ఎన్నార్సీ, సీఏఏలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుందని అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: