ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మరియు రాష్ట్ర భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి జగన్ సంచలన కరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ తొందరపడి ప్రకటించకుండా కన్ఫామ్ వైజాగ్ కన్ఫామ్ అని అందరూ అనుకుంటున్న తరుణంలో రాజధాని విషయంలో ఏమీ ప్రకటించకుండా చాలా ఆచితూచి అడుగులేస్తూ మూడ రాజధానుల విషయంలో వస్తున్న రిపోర్టులు అన్నిటినీ పరిశీలిస్తూ జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంది. ఈ సందర్భంగా మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాతో ప్రకటించారు. రాజధాని భూముల విషయంలో చంద్రబాబు వర్గాలకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే బినామీల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ  సిబిఐ లేదా సిఐడి తో విచారణ కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 

మరియు అదే విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఈ ఎన్నికల్లో ఎస్టీలకు 4 శాతం ఎస్సీలకు 19.08 బీసీలకు 38 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఈ మేరకు తీర్మానం చేశామని పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాల గురించి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో ఎక్కువగా మీడియాతో మాట్లాడటం జరిగింది. అయితే మంత్రి పేర్ని నాని చెప్పిన వాటిలో సీఎం జగన్ తీసుకున్న ఒక నిర్ణయానికి అన్నీ నిర్ణయాల్లో ఇది సూపర్ హైలెట్ థాంక్యూ సీఎం సార్ అని ఒక విషయం గురించి ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు.

 

అదేమిటంటే రాష్ట్ర రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీతో పాటు శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రిమండలి అధ్యయనం చేసింది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. కంగారూ పడకుండా అన్నీ కమిటీలనీ సమీక్షిస్తు సరైన రీతిలో నిర్ణయం తీసుకునే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు అన్ని నిర్ణయాల్లో ఇదే హైలెట్ అని పబ్లిక్ కామెంట్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: