ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయమే. కనీ విని ఎరుగని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా మూడు రాజధానిలు  ఉన్న దాఖలాలు లేవు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అభివృద్ధి రాష్ట్రంలో ఒక్కేచోట ఆగిపోకూడదు అని అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతైనా అవసరమని దీని కోసం మూడు రాజధానులు ఏర్పడే అవకాశం ఉంది అంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఆంధ్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. 

 


 అంతేకాదు కేంద్రంలోని పెద్దల్లో కూడా జగన్ నిర్ణయం ఆసక్తిని కనబరుస్తోంది. జగన్ నిర్ణయం పై సినీ రాజకీయ ప్రముఖుల నుండి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సీఎం జగన్ మూడు  రాజధానిల నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. అమరావతి అభివృద్ధి చేయలేకే ప్రజాధనాన్ని వృధా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలు అంటూ కొత్త అంశం తెరమీదకు తెచ్చారని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అటు అమరావతిలో రైతులు కూడా జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా  తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయమే హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 


 ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని అద్భుత రాజధానిగా ఎలా తీర్చిదిద్దవచ్చు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న... లక్ష కోట్లు ఖర్చు సాకుతో విశాఖ వైపు చూస్తున్నది మీ ల్యాండ్ మాఫియా కోసమే కదా అంటూ మాజీమంత్రి టీడీపీ నాయకుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ ను సూటిగా ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం అమరావతిని చంపేయడం ఎంతవరకు న్యాయం అంటూ నిలదీసారు నారా లోకేష్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఇ కపోతే టిడిపి నేతలు అందరూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: