రాజధాని నగరం ఢిల్లీ లో ద్వారకాకు చెందిన 69 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్, ఇంకా అతని భార్య తమ ప్రాంతానికి సమీపంలో ఓ రోడ్డుని దాటుతుండగా ఒక బిబిఎ విద్యార్థి నడుపుతున్న కారు ఢీకొట్టడంతో బుధవారం నాడు మరణించారు. అమర్దీప్ సింగ్ గిల్, రజనీ గిల్ గా గుర్తించబడిన ఈ జంట, క్యాబ్ దిగి, సెక్టార్ 7 లో రోడ్డు దాటుతుండగా, వోక్స్వ్యాగన్ పోలో అనే కారు అర్ధరాత్రి సమయంలో ఢీకొట్టింది.


తమ బంధువుల కార్యక్రమానికి హాజరైన తర్వాత వారు తిరిగి ఇంటికి వస్తున్నారని పోలీసులు చెప్పారు. కారు వారిని ఢీకొట్టడానికి గల కారణం వెతకగా... ఈ జంట రహదారిపై నుండి కొన్ని అడుగుల దూరంలో దిగినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే దంపతులను ఆసుపత్రికి తరలించగా అక్కడ వారు చనిపోయినట్లు ప్రకటించారు వైద్యులు. దంపతులను కారు ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ పారిపోయాడు. కానీ ఒక ప్రత్యక్ష సాక్షి వాహనాన్ని వెంబడించి, రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ కారు నేతాజీ సుభాష్ ప్లేస్‌లోని ఒక సంస్థలో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.


అయితే, ఈ కారును ప్రతాంపూరలోని ఒక డీలర్‌కు విక్రయించినట్లు తెలిసింది. పోలీసులు డీలర్‌ను ప్రశ్నించగా, వికాస్‌పురిలో ఒక వ్యక్తి కారును తీసుకువచ్చాడని చెప్పాడు. వెంటనే ఒక బృందాన్ని వికాస్‌పురికి పంపారు, అక్కడ నుండి కారును స్వాధీనం చేసుకున్నారు. "నిందితుడిని వికాస్‌పురిలో గురువారం రోజు అరెస్టు చేసాము. కారు కూడా స్వాధీనం చేసుకున్నాం" అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ద్వారకా జిల్లా) ఆంటో అల్ఫోన్స్ తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వారు కెనడాలో స్థిరపడ్డారు. వారికి తమ తల్లిదండ్రులు మరణాల గురించి సమాచారం ఇవ్వబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: