ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం జగన్ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.సీఎం జగన్ పాలనపై ప్రజలలో కూడా సంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ ముగ్గురు వైసీపీ నేతల వలన జగన్ ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.  వైసీపీ పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలు జగన్ కు తలనొప్పిగా తయారయ్యారని వైసీపీ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం. 
 
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాజధాని గురించి బొత్స సత్యనారాయణ ఎన్నో సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు రావటానికి ఒక రకంగా బొత్స సత్యనారాయణ కారణం. కానీ బొత్స పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల గురించి జగన్ ఎలా స్పందించారో మాత్రం బయటకు రాలేదు. బొత్స వ్యాఖ్యలు చేసిన విధంగానే రాజధాని విషయంలో జగన్ కూడా అడుగులు ముందుకు వేయడం గమనార్హం. 
 
మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్ మూడు రాజధానులు ఉండొచ్చని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసిన తరువాత " మూడు రాజధానులైనా పెట్టుకుంటాం... ముప్పై రాజధానులైనా పెట్టుకుంటాం " అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు విమర్శలు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గొడవ పడినంత పని చేశారు. 
 
వైసీపీ పార్టీ వర్గాలు ఈ ముగ్గురు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా ఈ వార్తను ధ్రువీకరిస్తూ ఉండటం గమనార్హం. మరి సీఎం జగన్ ఈ ముగ్గురి విషయంలో ఏం చేయబోతున్నారు...? ఏవైనా చర్యలు తీసుకుంటారా...? అనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: